AP Cabinet meeting Highlights on 03/09/2020 ఆంద్రప్రదేశ్ ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోము అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం
AP Cabinet meeting Highlights on 03/09/2020
కనెక్షన్ ఉన్న రైతు పేరు మీదనే బ్యాంక్ ఖాతా వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేకుండా చర్యలు
10 వేల మెగవాట్ల సోలార్ విద్యుత్ రూపకల్పనకు ప్రయత్నాలు
ఉచిత విద్యుత్ ద్వారా ఒక్కో రైతుపై ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.49,600
శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ అమలు.
ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న ఉచిత విద్యుత్ పథకం
విజయనగరం జిల్లాలో సుజల స్రవంతి పథకానికి ఆమోదం.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు.
పంచాయతీ రాజ్ శాఖలో డివిజనల్ డెవలప్‌మెంట్ పోస్టులకు ఆమోదం.
AP Cabinet Decisions: కృష్ణా నదిపై రెండు బ్యారేజీలకు కేబినెట్ ఓకే, ప్లేస్ ఖరారు
ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీలు నిర్మాణం చేయాలని ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. ఒక్కో బ్యారేజీ 3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య రూ.1215 కోట్లతో బ్యారేజీని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, మోపిదేవి మండలం బండికోళ్ల లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూర్పుపాలెం మధ్య రూ.1350 కోట్లు వ్యయంతో బ్యారేజీ నిర్మాణం చేయాలని మరో తీర్మానం చేసింది
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గొల్లాపల్లి, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో సాగు, తాగు నీటి కష్టాలు తీర్చేందుకు వరికపూడి శెల అని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. అందుకు రూ.1273 కోట్లు ఖర్చవుతుంది. ఉత్తరాంధ్రలో సాగు, తాగు అవసరాలు తీర్చడానికి బాబూ జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల సృవంతి పథకాన్ని రూపొందించనున్నారు. రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా వివిధ నిర్మాణాలు, ఎత్తిపోతల పథకాలు కింద 14 పనులు త్వరగా చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
ఏపీ కేబినెట్‌లో మరికొన్ని తీర్మానాలు
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన నాడు - నేడు మన బడి, నాడు - నేడు వైద్యం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, రైతు భరోసా కార్యక్రమాలకు ప్లానింగ్, ఫండింగ్, ఫైనాన్సింగ్ కోసం ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
బాపట్లలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం గుంటూరు జిల్లా మూలపాలెం, జమ్ములపాలెంలో 51 ఎకరాలు కేటాయింపు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో మెడికల్ కాలేజీ కోసం రాయవరం రెవిన్యూ గ్రామంలో 47 ఎకరాలు భూమి కేటాయింపు
మావోయిస్టు సంఘాలు, అనుబంధ సంఘాలపై ఏడాది నిషేధం కొనసాగింపు
పశ్చిమ గోదావరి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం
0 comments:
Post a comment