Tuesday 17 November 2020

AP సంక్రాంతి వరకు అన్ని రకాల బదిలీలు బంద్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభం జనవరి 15 వరకు సాగనున్న ప్రక్రియ

AP సంక్రాంతి వరకు అన్ని రకాల బదిలీలు బంద్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభం జనవరి 15 వరకు సాగనున్న ప్రక్రియ

AP సంక్రాంతి వరకు అన్ని రకాల బదిలీలు బంద్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభం జనవరి 15 వరకు సాగనున్న ప్రక్రియ  ఆ ప్రక్రియతో సంబంధం ఉన్న ఉద్యోగులెవరినీ బదిలీ చేయడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు


AP సంక్రాంతి వరకు అన్ని రకాల బదిలీలు బంద్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభం జనవరి 15 వరకు సాగనున్న ప్రక్రియ


జనవరి 15 వరకు సాగనున్న ప్రక్రియ ఐఏఎస్ లు, ఆర్డీవోలు, రెవెన్యూ సహా ఉద్యోగులెవరినీ బదిలీ చేయొద్దు అత్యవసరంగా చేయాల్సి వస్తే ఈసీ అనుమతి తీసుకోవాలి సీఈవో 




అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులు, ఆర్డీవోలు, ఇతర రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ తదితర కీలక శాఖల్లోని సిబ్బందికి రెండు నెలల పాటు బదిలీలు ఉండవు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఉండడంతో ఆ ప్రక్రియతో సంబంధం ఉన్న ఉద్యోగులెవరినీ బదిలీ చేయడానికి వీల్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 

కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఆదేశాల మేరకు ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రత్యేక సవరణ కార్యక్రమం నవంబరు 16 నుంచి జనవరి 15వ తేదీ వరకు జరుగుతుంది.

దీంతో జిల్లా ఎన్నికల అధికారులు, డిప్యూటీ ఎన్నికల అధికారులు, ఈ ప్రక్రియతో సంబంధమున్న అధికారులెవరినీ బదిలీలు చేయకూడదు. జిల్లా రిటర్నింగ్‌ అధికారులుగా కలెక్టర్లు, ఉప రిటర్నింగ్‌ అధికారులుగా జేసీలు, ఆర్డీవోలు ఉంటారు. 

అదేవిధంగా రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ యంత్రాంగం మొత్తం ఇందులో పాలుపంచుకోవలసి ఉండడంతో ఆయా శాఖల్లోనూ బదిలీలు ఉండవు. ఒకవేళ ఎవరినైనా అత్యవసరంగా బదిలీ చేయాల్సి వస్తే.. ముందుగా ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.