Tuesday 24 November 2020

AP 8th Class Year Plan/Varshika Pranalika Academic Year 2020-21

AP 8th Class Year Plan/Varshika Pranalika Academic Year 2020-21

AP 8th Class Year Plan/Varshika Pranalika Academic Year 2020-21: AP VIIIth Class Year Plan/Lesson plan for the Academic Year 2020-21 for Subject wise Telugu,English, Hindi and Mathematics, Science Biological Science and Physical Science and Social Studies Subject wise Year Plan/Unit Plan/ Period Plan download



AP 8th Class Year Plan/Varshika Pranalika Academic Year 2020-21


AP 8th Class Year Plan Unit Plan Period Plan for all subjects Languages and Non Languages 8th Class Year Plan/Varshika Pranalika Academic Year 2020-21 Subject wise Telugu,English, Hindi and Mathematics, Science Biological Science and Physical Science and Social Studies Subject wise Year Plan/Unit Plan/ Period Plan download




Abjectives of Year Plan Unit Plan Period Plan and Lesson plans for class 8th in this Academic Year 2020-21 for 8th Class Year Plan/Varshika Pranalika Academic Year 2020-21


వార్షిక విద్యా ప్రణాళిక - ఉద్దేశ్యం


ప్రస్తుత 'కోవిడ్-19' పరిస్థితుల దృష్ట్యా, విద్యార్థుల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల బోధనాభ్యసన ప్రక్రియకు 'కోవిడ్-19' పరిస్థితులు ప్రతిబంధకాలుగా కాకుండా విద్యార్థులలో ఆయా తరగతి అభ్యసన ఫలితాల సాధన లక్ష్యంగా రూపొందించబడిన ప్రణాళిక. నిర్దేశింపబడిన లక్ష్యాల సాధన, అందుబాటులో ఉన్న | వనరులతో, విద్యార్థుల అవసరాలు, సామర్థ్యాలను, అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు తమ బోధనను విద్యార్థులు తమ అభ్యన నాలను కొనసాగించుటకు వీలు కల్పించబడుతుంది అకాడమిక్ క్యాలెండర్ అనేది పాఠశాల సంబంధిత కార్యక్రమాలన్నింటినీ ఒక నిర్దిష్ట సమయంలో చేయడానికి ఉపయోగపడే ప్రణాళిక. పాఠశాలలో విద్యా కార్యకలాపాలను ముందుగానే సిద్ధం చేయడానికి ఇది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు మార్గ నిర్దేశనం చేస్తుంది. ఈ ప్రణాళికలో విద్యార్థుల, ఉపాధ్యాయుల అవగాహన మరియు కార్యాచరణ కొరకు ఈ విద్యా సంవత్సరంలో నవంబరు నెల నుంచి ముఖ్యమైన రోజులను 'కోవిడ్-19 కు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని, పాఠ్యాంశాల వారీ అభ్యసన ఫలితాలను, తరగతి గదిలో ఉపాధ్యాయునిచే | నిర్వహించబడు కృత్యాలను, అదే విధంగా విద్యార్థులు స్వతహాగా తమ ఇంటి వద్ద నిర్వహించుకునే కృత్యాలను పొందు పరచడం జరిగింది. అదే విధంగా సెలవుల వివరాలు, కాల నిర్ణయ పట్టిక మరియు 'కోవిడ్-19' పరిస్థితులను అధిగమించడానికి విద్యార్థులలో రోగ నిరోధక శక్తిని పెంపొందింప చేసి మానసిక, శారీరక ధృఢత్వం కోసం యోగా, ఆనంద వేదిక లాంటి అంశాలను సూచించడమైనది. వీటితో పాటుగా విద్యార్థులచే నిర్వహించబడే ప్రాజెక్టు

పనులు, చిన్న చిన్న క్షేత్ర పర్యటనలు, పరిశీలన మొదలైనవి పొందు పరచడం జరిగింది విద్యార్థులలో ఆయా తరగతికి సంబంధించిన అభ్యసనా ఫలితాలను సాధించడానికి ఉపాధ్యాయునికి మార్గదర్శినియే ఈ ప్రత్యేక విద్యా ప్రణాళిక


ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక సూచనలు


కోవిడ్-19' దృష్ట్యా పాఠశాలల ప్రారంభమునకు, ప్రధానోపాధ్యాయులు భౌతిక సామాజిక దూరాన్ని పాటించడాన్ని ఆరోగ్యం మరియు వ్యక్తిగత పరిశుభ్రతను దృష్టిలో నుంచుకొని ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. జాతీయ, రాష్ట్ర విధి విధానాలకు లోబడి, బోధనాభ్యసన ప్రక్రియ ఉండాలి. పాఠశాల (పాఠశాల పేరంట్స్ కమిటీ) సభ్యులు, స్థానిక ఆరోగ్య కార్యకర్తలు మరియు స్థానిక నాయకులతో చర్చించి సుదీర్ఘమైన ప్రణాళిక తయారు చేయాలి. ఇవి స్థానికంగా ఉన్న అవకాశాలు, సంపద, ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి

పాఠశాలల ప్రారంభానికి ముందు, తరువాత పాటించవలసిన ఆరోగ్య రక్షణ విధానాలు మరియు భౌతిక సామాజిక దూరాన్ని పాటిస్తూ విద్య నేర్చుకోవడంపై పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన మార్గదర్శకాల (ఎస్ఓపి) ను తు.చ. తప్పక పాటించాలి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సూచించిన 'అకడమిక్ క్యాలెండర్' ను పాఠశాల పరిస్థితులు, సమయానుకూల ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని పాటిస్తూ విద్యార్థులలో అభ్యసన ఫలితాలను గుణాత్మక స్థాయిలో మెరుగు పరచడానికి తగిన కృషి చేయాలి. ఉపాధ్యాయులు తమ తమ సబ్జెక్టులలో తరగతి గది మరియు విద్యార్థి ఇంటి వద్ద చేయదగిన కృత్యాల మీద ప్రత్యేక శ్రద్ద వహించాలి ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా కార్యక్రమాలను (ఇన్ క్లూసివ్ ఎడ్యుకేషన్) పాఠశాల కార్యక్రమాలతో అనుసంధానం చేస్తూ బోధన చేయాలి. పాఠశాల పనిగంటలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించాలి విద్యార్థుల అభ్యసన సమయం, ఉపాధ్యాయుల తయారీ, పాఠ్య, సహపార్య కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని పీరియడ్స్ విభజనను, పాఠశాల కాల నిర్ణయ పట్టికలను క్యాలెండర్ లో పొందుపరచడం జరిగింది. ప్రతి ఉపాధ్యాయుడికి సమాన పనిభారం ఉండాలి. ప్రతి పాఠశాలలో సహపాఠ్యాంశాలకు కేటాయించిన పీరియడ్లను, ఇతర సబ్జెక్టు పీరియను పూర్తిగా నిర్వహించేలా, ఉపాధ్యాయులందరూ సమిష్టి బాధ్యత ప్రధానోపాధ్యాయుడు పాఠశాల సంస్థాగత ప్రణాళికను తయారుచేసుకొని అమలుచేయాలి. వహించేలా

వివిధ రకాల పోటీ పరీక్షలను విద్యార్థులకు తెలియజేసి, అందులో అందరు విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. అందులో వారు అత్యున్నత ప్రతిభ కనపరిచేలా వారికి ప్రత్యేక శిక్షణను అందించాలి. వార్షిక విద్యా ప్రణాళికలో సూచించిన విధంగా తరగతిలోని పాఠ్యాంశాల బోధనలో ఉపాధ్యాయుని సహాయంతో బోధించేవి, విద్యార్థులు స్వయంగా నేర్చుకునేవి మరియు విద్యార్థులలో ప్రతిభను ప్రోత్సహించడానికి సూచించబడిన ఐశ్చిక కృత్యాలుగా వర్గీకరించుకొని ఉత్తమ బోధనాభ్యసన ద్వారా విద్యార్థులలో అభ్యసనా ఫలితాలను పూర్తి స్థాయిలో సాధించాలి


Get Download Subject wise Year Plan/Unit Plan/ Period Plan at

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.