Wednesday 25 November 2020

AP Conduct only one Summative Assessment Test Reduced Formative Assessment tests in this Academic Year 2020-21

AP Conduct only one Summative Assessment Test Reduced Formative Assessment tests in this Academic Year 2020-21

AP Conduct only one Summative Assessment Test in this Academic Year 2020-21;AP సమ్మేటివ్ పరీక్ష ఈ ఏడాదికి ఒక్కటే ఫార్మేటివ్ పరీక్షల్లోనూ సడలింపులు పాఠశాల విద్యా శాఖ నిర్ణయం 


AP Conduct only one Summative Assessment Test Reduced Formative Assessment tests in this Academic Year 2020-21 


రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభం కావడం, ముఖాముఖి తరగతుల నిర్వహణ కూడా విద్యార్థులందరికీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాని నేపథ్యంలో ఆ ప్రభావం ఫార్మే టివ్, సమ్మేటివ్ పరీక్షలపై పడుతోంది. గతంలో ఏటా మూడు సమ్మేటివ్లు, 4 ఫార్మే టిట్లుండగా వాటిని ప్రభుత్వం కుదించింది సమ్మేటివ్ ను రెండుగా చేసింది




అయితే ఇప్పుడు కోవిడ్ వల్ల పాఠశాల విద్యా శాఖ సమ్మేటివ్ ను ఒక్కదానికే పరిమితం చేసింది విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు మాత్రమే నిర్వ హించనుంది. మరోవైపు ఫార్మేటివ్ పరీక్షలు నాలుగింటిని కూడా రెండుకు కుదించింది. 

ఈనెల 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిం చినా అన్ని తరగతులను నిర్వహించలేని పరి స్థితులుండటంతో వాటిలో కూడా సడలింపులు చేపట్టింది. విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా 8, 9 తరగతులను రోజువిడిచి రోజు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే 6, 7 తరగతు లను కూడా రోజువిడిచి రోజు పెట్టనున్నారు ఇక ఎలిమెంటరీ తరగతుల ప్రారంభంపై సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. 

తల్లిదండ్రుల సమ్మతి మేరకే విద్యార్థులను స్కూళ్లకు రప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హాజరు నుంచి కూడా మినహాయింపు ఇవ్వనున్నారు. విద్యార్థులందరికీ ఫార్మేటివ్ పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారడంతో వాటి నుంచి కూడా సడలింపులకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రాజెక్టు ఆధారిత పరీక్షలను నవంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-1 డిసెంబర్ చివరి వారంలో, ఫార్మేటివ్-2 ఫిబ్రవరి చివరి వారంలో, సమ్మేటివ్ పరీక్ష లను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించ నున్నారు. తరగతి గదిలో బోధించే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని సమ్మేటివ్ పరీక్షలు పెడతారు. 

పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నలను కూడా తరగతుల్లో బోధించిన అంశాలను ఆధారంగా చేసుకొనే ఇవ్వనున్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.