Friday 27 November 2020

AP రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది పలు కీలక నిర్ణయాలు

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది పలు కీలక నిర్ణయాలు

AP రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు 2 గంటలకు పైగా సాగిన మంత్రివర్గ సమావేశం ఉద్యోగులకు దశల వారీగా డీఏ బకాయిల చెల్లింపులతో పాటు పలు అంశాలపై చర్చ సాగింది


AP రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది పలు కీలక నిర్ణయాలు


సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో భారీ వర్షాలు, నివర్ తుపానుపై చర్చించారు. నష్టపరిహారంపై అంచనాలను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 



ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలను మంత్రి కన్నబాబు మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు వివరించారు


రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు


కడప జిల్లా కోప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్‌, ఎలక్ట్రానిక్ క్లస్టర్‌కు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయించిందని కన్నబాబు తెలిపారు.  

రాజధాని స్టార్టప్ ప్రాజెక్టులను రద్దు చేస్తున్నామని, ఏడీపీ లిక్విడేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇవ్వడానికి నిర్ణయించినట్లు చెప్పారు. నివర్ తుపాను, భారీ వర్షాలపై కేబినెట్‌లో చర్చ జరిగినట్లు చెప్పారు. డిసెంబర్ 15 నాటికి నష్టపరిహారంపై అంచనాలు పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా తుపాను కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు చెప్పారు. ప్రాథమికంగా 30 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. 13 వేల ఎకరాలలో ఉద్యానవన పంటలు  దెబ్బతిన్నాయన్నారు. డిసెంబర్ నెలాఖరులోపు నష్ట పరిహారం అందించాలని సీఎం సూచించినట్లు కన్నబాబు చెప్పారు. 

పంట నష్టం వాటిల్లిన రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేస్తామన్నారు. నిబంధనల ప్రకారం మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామన్నారు. పునరావాస శిబిరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500 ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాట్లు మంత్రి కన్నబాబు తెలిపారు


పోలవరంపై కేబినెట్‌లో చర్చ 


ఒరిజినల్‌ డిజైన్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టడానికి కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి కన్నబాబు తెలిపారు. 2017లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ తీసుకునే క్రమంలో.. 2014 రేట్ల ప్రకారం చెల్లిస్తామని, అందుకు అంగీకరించాలని కోరారు


ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లింపు


ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కన్నబాబు తెలిపారు. 3.144 శాతం డీఏ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. త్వరలో 2, 3 డీఏలు చెల్లిస్తామన్నారు. కరోనా సమయంలో ఆపిన మార్చి నెల వేతనాలను డిసెంబర్‌లో, ఏప్రిల్‌ నెలలో పెండింగ్‌ బకాయిలను జనవరిలో అందిస్తామన్నారు

డిసెంబర్ 25న పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపకం కార్యక్రమం ఉంటుందన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా 17 వేల కాలనీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్థలాలు ఇచ్చిన రోజే ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్ 15 నుంచి వైఎస్సార్ పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాదిలోగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, 

డిసెంబర్ 2న ఆమూల్ పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభించన్నట్లు చెప్పారు. ఆ రోజు నుంచే  లీటర్‌ పాలకు అదనంగా రూ.4 చెల్లిస్తామన్నారు. డిసెంబర్ 21న సమగ్ర భూసర్వేను సీఎం జగన్ ప్రారంభిస్తారన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్, పల్నాడు ప్రాజెక్టుల కోసం ఎస్పీవీలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా పరిహారం చెల్లించాలని సీఎం తెలిపారు. 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని సీఎం సూచించారు. 

పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందజేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. 

పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో  అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ ముసాయిదా బిల్లులకు ఆమోదంపై చర్చించారు. 

ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణం పథకాలపైనా చర్చించారు. ఉద్యోగులకు దశల వారీగా డీఏ బకాయిల చెల్లింపులతో పాటు పలు అంశాలపై చర్చ సాగింది.

నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇటీవల కాలంలో ఇంటి పన్నును సవరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొంది.ఈ మేరకు తీసుకొచ్చిన బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 

డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 30.20 లక్షల మందికి డీ ఫాం పట్టాలు ఇవ్వనుంది ఏపీ సర్కార్. లే ఔట్ల అభివృద్ది, ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నెల 21నుండి భూముల రీ సర్వే కు కేబినెట్ అంగీకరించింది. 

డిసెంబర్ 8న 2.49 లక్షల మందికి గొర్రెలు, మేకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.