Friday 27 November 2020

మార్చి వరకు ఉచిత రేషన్ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తెల్లరేషన్ కార్డు దారులకు వెసులుబాటు

మార్చి వరకు ఉచిత రేషన్ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తెల్లరేషన్ కార్డు దారులకు వెసులుబాటు

మార్చి వరకు ఉచిత రేషన్ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తెల్లరేషన్ కార్డు దారులకు వెసులుబాటు కోవిడ్ రెండో దశ మొదలు కావడంతో ఈ విధానాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు తెల్ల రేషన్ కార్డుదారులకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది


మార్చి వరకు ఉచిత రేషన్ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తెల్లరేషన్ కార్డు దారులకు వెసులుబాటు


అమరావతి కరోనా ప్రభావంతో జీవనోపాధి కోల్పోయిన పేద ప్రజలకు కేంద్రప్రభుత్వం ఏప్రిల్ నుంచి నెలకు రెండు విడత లుగా ఉచితంగా బియ్యం తో పాటు పప్పు దినుసులు అందజేస్తున్నది నవంబర్ నెలాఖరు వరకు 16 విడతలు ఉచిత రేషన్ అందజేసింది అయితే ప్రస్తుత తరుణంలో కోవిడ్ రెండో దశ మొదలు కావడంతో ఈ విధానాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు తెల్ల రేషన్ కార్డుదారులకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ విషయం పై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కారు అధికారిక సమాచారం పంపినట్లు వార్తలు వెలువడ్డాయి 2021 మార్చి నెలాఖరు వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలంగాణా రాష్ట్రానికి సమాచారం పంపినట్లు తెలుస్తోంది అయితే ఆంధ్ర ప్రదేశ్ కు అలాంటి సమాచారం రాలేదని అధికారులు చెబుతున్నారు. 




డిసెంబర్ 3 నుంచి గతంలో మాదిరిగా ప్రజా పంపిణీ జరుగుతుందని చెబుతున్నారు ఇప్పటికే కందిపప్పు విక్రయాలకు సంభవించి కిలో కు రూ.66 చెల్లించాలని పౌర సరఫరాల సంస్థ చౌక దుకాణాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. 


అయితే ఈ నెల 28వతేదీ ప్రధాని మోడీ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న సందర్భంగా ఉచిత రేషన్ పై కీలక ప్రకటన చేసే అవకాశంఉన్నట్లు సమాచారం


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.