Thursday 26 November 2020

పాఠశాల విద్య తెలంగాణ రాష్ట్రం విషయవారీ ప్రగతి నమోదు రిజిష్టర్ (Central Marks Register) ప్రాథమికోన్నత/ఉన్నత స్థాయి 6 నుండి 10వ తరగతి వరకు

పాఠశాల విద్య తెలంగాణ రాష్ట్రం విషయవారీ ప్రగతి నమోదు రిజిష్టర్ (Central Marks Register) ప్రాథమికోన్నత/ఉన్నత స్థాయి 6 నుండి 10వ తరగతి వరకు

పాఠశాల విద్య తెలంగాణ రాష్ట్రం విషయవారీ ప్రగతి నమోదు రిజిష్టర్ (Central Marks Register) ప్రాథమికోన్నత/ఉన్నత స్థాయి 6 నుండి 10వ తరగతి వరకు గల విద్యార్థులు వివిధ విషయాలలో సాధించిన ప్రగతిని తరగతి ఉపాధ్యాయుడు నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాల వారీగా ఈ రికార్డులో నమోదు చేయాలి


పాఠశాల విద్య తెలంగాణ రాష్ట్రం విషయవారీ ప్రగతి నమోదు రిజిష్టర్ (Central Marks Register) ప్రాథమికోన్నత/ఉన్నత స్థాయి 6 నుండి 10వ తరగతి వరకు


తరగతి ఉపాధ్యాయుడు ఒక తరగతికి చెందిన అన్ని సబ్జక్టులలో పిల్లల ప్రగతి వివరాలను subject  బోధించే ఉపాధ్యాయుల సహకారంతో నమోదు చేయాలి. subject  బోధించే ఉపాధ్యాయుల సహకారంతో సమాచారం నింపిన తరవాత తరగతి ఉపాధ్యాయుడు వీటి ఆధారంగా క్యుములేటివ్ రికార్డులో వివరాలు నమోదు చేయాలి




ఈ రిజిష్టర్ లోని రికార్డు షీటులో సంగ్రహణాత్మక మూల్యాంకనం మార్కులను నమోదు చేసేటప్పుడు SA1, SA2లలో దేనికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తే దానికి సంబంధించిన సంగ్రహణాత్మక మూల్యాంకనంపై (V) టిక్ చేసి మిగతా దానిని కొట్టివేయాలి

6th నుండి 10th తరగతులలో ప్రతి సబ్జెక్టు కు 100 మార్కులు ఉంటాయి. దీంట్లో FA కు 20 మార్కులు, SA కు 80 మార్కులు ఉంటాయి

మొదటి సంగ్రహణాత్మక మూల్యాంకనం (SA1) కోసం FA1, FA2ల సగటు 20 మార్కులను, పరీక్ష 80 మార్కులకు కలిపి 100 మార్కులుగా నమోదు చేయాలి. అల్లే విద్యా సంవత్సరం చివరికి SA2 ని నిర్వహిస్తారు. వార్షిక ఫలితం కోసం SA2 పరీక్ష మార్పులు 80కి నాలుగు FAల సగటు మార్పులు 20ని కలిపి నమోదు చేయాలి 6,7 తరగతులకు సామాన్యశాస్త్రం:8, 9, 10 తరగతులకు భౌతిక రసాయన శాస్త్రం ఈ రిజిష్టర్లో ఒకే గడిలో చూపనైనది. కావున ఆయా పరీక్షలకు సంబంధించిన మార్కులు, గ్రేడులు నమోదు చేసేటప్పుడు సంబంధితం సబ్జెక్టు ను సూచించి మిగతా దానిని కొట్టివేయాలి

భౌతిక రసాయనశాస్త్రం, జీవశాస్త్రం 8, 9, 10 తరగతులకు వేర్వేరు పేపర్లుగా ఉన్నందున మీరు నిర్వహించే

పరీక్ష 40 మార్కుల చొప్పున లేదా 80 మార్కుల చొప్పున నిర్వహించి సంబంధిత గడిలో నమోదు చేయాలి నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనాల సగటును 20 మార్కులుగా, రెండవ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో

మార్కులకు విద్యార్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా వార్షిక ఫలిత గ్రేడును లెక్కించాలి. ప్రతి తరగతికి సహపార్య విషయాల మార్కులను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే వీటికి FA ఉండదు. కేవలం సంగ్రహణాత్మక మూల్యాంకనం సందర్భంగా మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది

ఈ రిజిష్టర్ లో తరగతి ఉపాధ్యాయుడు తాను బాధ్యత వహిస్తున్న తరగతికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి ప్రధానోపాధ్యాయునికి అందించాలి. తరగతి ఉపాధ్యాయులు వార్షిక ఫలితాన్ని సరిగా పూరించారో లేదో ప్రధానోపాధ్యాయుడు పరిశీలించాలి

అన్ని తరగతుల ఫలితాల వివరాల వద్ద ప్రధానోపాధ్యాయుడు, ఆయా తరగతి ఉపాధ్యాయులు సంతకం చేయాలి వార్షిక ప్రగతి నమోదు వివరాల జీరాక్స్ ప్రతిని విద్యా సంవత్సరం చివర ఉప విద్యాధికారికి అందజేయడం ప్రధానోపాధ్యాయుడి బాధ్యత


విద్యా ప్రణాళిక వంధి పత్రం-2011 (SCF) మౌలిక సూత్రాలు


పిల్లలు తమకున్న సహజమైన శక్తిసామర్థ్యాల ఆధారంగా నేర్చుకునేలా ప్రధానంగా దృష్టిపెట్టడం. పిల్లల భాష మరియు సమాజంలోని వివిధ రకాలైన జ్ఞాన వ్యవస్థలను గౌరవించడం, వాటిని అభ్యసనంలో వినియోగించడం

జ్ఞానాన్ని బడిబయటి జీవితంతో అనుసంధానం చేయడం బట్టీ విధానాలకు స్వస్తిపలకడం, వాటికి బదులుగా పరస్పర ప్రతిచర్యలు (lateractian), ప్రొకెక్టుపనులు అన్వేషణలు (Explorations), ప్రయోగాలు, విశ్లేషణలు వంటి పద్ధతులద్వారా పిల్లలు అర్థవంతంగా నేర్చుకోవడం నేర్చుకోవడాన్ని పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా, పిల్లల సమగ్ర అభివృద్ధికోసం విద్యాప్రణాళిక తగిన అవకాశాలు కల్పించడం, ఇందుకనుగుణంగా పార్యపుస్తకాలలో మార్పులు చేర్పులు చేపట్టడం.

నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని (Continuous Comprehensive Evaluation) అమలు చేయడం ద్వారా పరీక్షలను సరళీకరించి, బోధనాభ్యసన ప్రక్రియల్లో అంతర్భాగం చేయడం, పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోడానికి మూల్యంకనం చేయడానికి బదులు పిల్లలు నేర్చుకోడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలనను సంస్కరించడం (Assessment for learning).

పార్యప్రణాళికలోని విభిన్న అంశాలను సమ్మళితం చేస్తూ, అర్ధవంతంగా నేర్చుకోడానికి వీలుగా సామాజిక నిర్మాణాత్మక (Social constructivism), విధానాలను తులనాత్మక విమర్శనాత్మక (Critical pedagogy) బోధనా విధానాల ఆధారంగా బోధనాభ్యసన ప్రక్రియలను నిర్వహించడం

పిల్లల సంస్కృతి, అనుభవాలు, స్థానిక అంశాలకు తరగతి గదిలో ప్రాధాన్యత కల్పించడం


Get Download Complete Central Marks Register Model at

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.