Monday 31 May 2021

7th Pay Commission పెన్షన్​ విధానంలో మార్పులు పెరిగిన ఫ్యామిలీ పెన్షన్​ లిమిట్

7th Pay Commission పెన్షన్​ విధానంలో మార్పులు పెరిగిన ఫ్యామిలీ పెన్షన్​ లిమిట్

7th Pay Commission పెన్షన్​ విధానంలో మార్పులు పెరిగిన ఫ్యామిలీ పెన్షన్​ లిమిట్ మరణించిన ఉద్యోగుల పిల్లలు లేదా తల్లిదండ్రులు రెండు పెన్షన్లను పొందేందుకు అర్హత

7th Pay Commission పెన్షన్​ విధానంలో మార్పులు పెరిగిన ఫ్యామిలీ పెన్షన్​ లిమిట్ 

భార్యాభర్తలిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై, సిసిఎస్ (పెన్షన్) 1972 పరిధిలో ఉంటే.. వారి మరణానంతరం వారసులు రెండు పెన్షన్లను పొందే అవకాశం కల్పించింది. ఇకపై రెండు పెన్షన్ల నుంచి వారసులు గరిష్టంగా ప్రతి నెలా రూ. 1.25 లక్షల వరకు​ పొందవచ్చు. 




సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 1972 లోని రూల్ 54, సబ్-రూల్ (11) ప్రకారం మరణించిన ఉద్యోగుల పిల్లలు లేదా తల్లిదండ్రులు రెండు పెన్షన్లను పొందేందుకు అర్హత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

తల్లిదండ్రుల్లో ఒకరు సర్వీసులో ఉన్నప్పుడు లేదా రిటైర్​మెంట్​ తరువాత మరణిస్తే, వారికి సంబంధించిన ఫ్యామిలీ పెన్షన్‌ను.. బతికున్న భర్త లేదా భార్యకు చెల్లిస్తారు. అయితే ఉద్యోగులైన భార్యాభర్తలిద్దరూ మరణిస్తే, వారి వారసులు రెండు ఫ్యామిలీ పెన్షన్లను మంజూరు చేయవచ్చని 7వ వేతన సంఘం సిఫార్సు చేసింది

కొత్త పెన్షన్​ రూల్స్​

ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల అత్యధిక వేతనాన్ని రూ. 2,50,000గా నిర్ణయించారు. అందువల్ల, రెండు పెన్షన్ పరిమితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ రెండు ఫ్యామిలీ పెన్షన్​ పరిమితులను నెలకు రూ .75,000 నుంచి రూ .1.25 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.