Sunday 6 June 2021

ఆగస్టు 1, 2021 నుంచి సెలవైనా ఫస్ట్ కే జీతం

ఆగస్టు 1, 2021 నుంచి సెలవైనా ఫస్ట్ కే జీతం

ఆగస్టు 1, 2021 నుంచి సెలవైనా ఫస్ట్ కే జీతం వారంలో అన్ని రోజులు పని చేయనున్న ఎన్ఏసీహెచ్ ఆగస్టు 1, 2021 నుంచి ఆచరణలోకి నిబంధన సెలవు దినాల్లోనూ పేమెంట్ లావాదేవీలు బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్

ఆగస్టు 1, 2021 నుంచి సెలవైనా ఫస్ట్ కే జీతం

 ముంబై బ్యాంక్ ఖాతాదారులకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ శుభవార్త అందించింది. జీతాలు, పెన్షన్ చెల్లింపులు, డివిడెండ్, వడ్డీ వంటి కీలకమైన పేమెంట్లు సెలవు దినంతో సంబంధం లేకుండా ఒకటో తేదీనే సెటిల్ అయ్యేందుకు మార్గం సుగుమమైంది. ఇందుకోసం పెద్ద చెల్లింపులను నిర్వహించే నేషనల్ ఆటోమేటెట్ క్లియరింగ్ హౌస్(ఎన్ఎసీహెచ్ సేవలు వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం. తీసుకుంది. ఆగస్టు 1, 2021 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో పనిచేసే ఎన్ఎసీహెచ్ పెద్ద మొత్తంలో చెల్లింపుల వ్యవస్థను నిర్వహిస్తోంది




డివిడెండ్, వడ్డీ, జీతం, పెన్షన్ వంటి వన్-టు-మెనీనగదు బదిలీ సౌకర్యాలను ఎన్ఎసీహెచ్ కల్పిస్తోంది. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ, స్, టెలిఫోన్ వాటర్, లోన్లకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్లు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు, ఇన్సూరెన్స్ ప్రీమియంపేమెంట్ కలెక్షన్లకు సౌకర్యాలను అందిస్తోంది. 

వినియోగదారుల సౌకర్యార్థం ఆర్టీజీఎస్ సేవలను వారంలో ఏడు రోజులపాటు అందుబాటులో ఉంచేందుకు.. బ్యాంక్ పని రోజుల్లో మాత్రమే కార్యకలాలు నిర్వహించే ఎన్ఎసీహెచ్ ఇకపై అన్నీ రోజులపాటు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ ప్రకటించారు. ఆర్బీఐ ద్రవ్య సమీక్ష అనంతరం ఆయనీ ప్రకటన చేశారు. డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విధానంలో ఎక్కువ సంఖ్యలో లబ్దిదారులకు చెల్లింపులు చేసేందుకు ఎన్ఎసీహెచ్ ఎంతో ప్రముఖమైనది. 

డీవీటీ విధానంలోనే ప్రభుత్వరంగ అనుబంధ సంస్థలు కొవిడ్ సమయంలో సమయానుగుణంగా, పారదర్శక, విధానంలో చెల్లింపులు చేస్తున్నాయని ఆర్బీఐ ఈ సందర్భంగా ప్రస్తావించింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.