Tuesday 22 June 2021

త్వరలోనే జియో 5జీ ఫోన్ ల్యాప్‌టాప్ లాంచ్ చేయనున్న - గూగుల్, జియో భాగస్వామ్యం

త్వరలోనే జియో 5జీ ఫోన్ ల్యాప్‌టాప్ లాంచ్ చేయనున్న - గూగుల్, జియో భాగస్వామ్యం

త్వరలోనే జియో 5జీ ఫోన్ ల్యాప్‌టాప్ లాంచ్ చేయనున్న - గూగుల్, జియో భాగస్వామ్యం అత్యంత స్మూత్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే కస్టం సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ రూపొందిస్తోంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఆపరేటింగ్ కంటే కాస్త వేరేగా ఈ ఆపరేటింగ్ సిస్టం ఉండనుంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల కోసం గూగుల్ ఈ ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంను రూపొందించింది

త్వరలోనే జియో 5జీ ఫోన్ ల్యాప్‌టాప్ లాంచ్ చేయనున్న - గూగుల్, జియో భాగస్వామ్యం

జియో ఈ నెలలోనే తన 5జీ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జూన్ 24వ తేదీన జరగనున్న జియో వార్షిక సదస్సులో జియోబుక్ ల్యాప్‌టాప్‌తో పాటు ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.




గూగుల్, జియో భాగస్వామ్యంలో 5జీ ఫోన్ రానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ మనదేశంలో వచ్చేవారం లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన జియో వార్షిక సదస్సు (ఏజీయం) జరగనుంది. ఇందులో జియో 5జీ ఫోన్‌తో పాటు చవకైన ల్యాప్‌టాప్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది

గతేడాది జరిగిన వార్షిక సదస్సులో గూగుల్ తన కంపెనీలో 7.7 శాతం వాటా కొనుగోలు చేసిందని జియో ప్రకటించింది. ఇందుకుగానూ రూ.33,737 కోట్ల పెట్టుబడులను గూగుల్ తమ కంపెనీలో పెట్టిందని పేర్కొంది. జియో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు తెలియరాలేదు కానీ ఇది వినియోగదారులను ఆకర్షించే తరహాలోనే ఉంది

అత్యంత స్మూత్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే కస్టం సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ రూపొందిస్తోంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఆపరేటింగ్ కంటే కాస్త వేరేగా ఈ ఆపరేటింగ్ సిస్టం ఉండనుంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల కోసం గూగుల్ ఈ ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంను రూపొందించింది

సప్లై చైన్ సమస్యల కారణంగా ఈ ఫోన్ తయారీలో గూగుల్, జియో సమస్యలు ఎదుర్కొంటున్నాయని కథనాలు వస్తున్నాయి. అయితే లిమిటెడ్ స్టాక్‌తో జూన్ 24వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. జియోబుక్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి

వీటి ప్రకారం ఇందులో 1,366 x 768 పిక్సెల్ రిజల్యూషన్ ఉన్న డిస్ ప్లేను అందించనున్నారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్ టాప్ పనిచేయనుంది. ఇందులో వేరియంట్లు కూడా ఉండే అవకాశం ఉంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఇప్పటికే కనిపించాయి

4జీ ఎల్టీఈ కనెక్టివిటీ కోసం ఇందులో స్నాప్ డ్రాగన్ ఎక్స్12 4జీ మోడెం ఉండనుంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఒక మినీ హెచ్‌డీఎంఐ కనెక్టర్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌లో మరో వెర్షన్ ఆధారంగా రూపొందించిన జియో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుందని లీకులు వచ్చాయి

త్రీ యాక్సెస్ యాక్సెలరోమీటర్, క్వాల్ కాం ఆడియో చిప్ కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం. జియో స్టోర్, జియో మీట్, జియో పేజెస్ వంటి యాప్స్ ఇందులో ముందే ఇన్ స్టాల్ అయి రానున్నాయి. 

దీంతోపాటు మైక్రోసాఫ్ట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఎంఎస్ ఆఫీస్ వంటి మైక్రోసాఫ్ట్ యాప్స్ కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం. ఈ ల్యాప్ టాప్ ఈ సంవత్సరమే లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే దీని ధర గురించిన వివరాలు తెలియరాలేదు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.