Monday 21 June 2021

నేటి నుంచి 7 జిల్లాల్లో డ్రైవింగ్‌ లైసెన్సు పరీక్షలు

నేటి నుంచి 7 జిల్లాల్లో డ్రైవింగ్‌ లైసెన్సు పరీక్షలు

నేటి నుంచి 7 జిల్లాల్లో డ్రైవింగ్‌ లైసెన్సు పరీక్షలు సోమవారం నుంచి విజయనగరం, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో వీటిని ప్రారంభిస్తారు. 


నేటి నుంచి 7 జిల్లాల్లో డ్రైవింగ్‌ లైసెన్సు పరీక్షలు


ఈనాడు, అమరావతి: కొవిడ్‌ కారణంగా రవాణాశాఖ కార్యాలయాల్లో నిలిచిపోయిన లెర్నర్‌, డ్రైవింగ్‌ లైసెన్సు పరీక్షలను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. 




కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో మే నుంచి ఈ పరీక్షలను వాయిదా వేశారు. సోమవారం నుంచి విజయనగరం, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో వీటిని ప్రారంభిస్తారు.

జులై ఒకటి నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో నిర్వహిస్తారు. మే, జూన్‌లలో స్లాట్లు పొందిన వారికి తొలుత అవకాశం ఇవ్వనున్నారు. 

వారం రోజుల్లో వీరంతా తమకు వీలున్న తేదీని రవాణాశాఖ పోర్టల్‌లోనే ఎంపిక చేసుకుని స్లాట్‌ పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.