Monday 14 June 2021

AP all Common Entrance Tests 2021 Scheduleds released on September 2021

AP all Common Entrance Tests 2021 Scheduleds released on September 2021

AP all Common Entrance Tests 2021 Scheduleds released  on September 2021 | AP ఉమ్మడి ప్రవేశ పరీక్షల’(సెట్స్‌) నిర్వహణ సెప్టెంబరులో | ‘సెట్స్‌ నిర్వహణ ఏజెన్సీగా ‘ఏపీ ఆన్‌లైన్‌’ ఎంపిక | ఈఏపీసెట్‌’ ర్యాంకింగ్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ రద్దు?


AP all Common Entrance Tests 2021 Scheduleds released  on September 2021


2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘ఉమ్మడి ప్రవేశ పరీక్షల’(సెట్స్‌) ను సెప్టెంబరులో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమాయత్తమవుతోంది. 




ఈ పరీక్షల నిర్వహించే విశ్వవిద్యాలయాలు, కన్వీనర్లను ఇప్పటికే ప్రకటించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడంతో ‘సెట్స్‌’కు సంబంధించిన నోటిఫికేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే, కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో ‘సెట్స్‌’ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఇబ్బంది లేనందున సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ‘సెట్స్‌’ నిర్వహణ ఏజెన్సీగా ఈ ఏడాది కూడా ‘ఏపీ ఆన్‌లైన్‌-టీసీఎ్‌స’ సంస్థను టెండర్‌ ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు.

సదరు ఏజన్సీ మరోసారి ఈఏపీ సెట్‌(ఎంసెట్‌), పీజీఈసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ లను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల విధానంలో నిర్వహించనుంది. ఇదిలావుంటే, ఈఏపీసెట్‌(ఎంసెట్‌) ర్యాంకింగ్‌లో ఇంటర్‌ మార్కులకు ప్రస్తుతం 25% ఉన్న వెయిటేజిని ఈ ఏడాదికి రద్దు చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.


Get More Information about AP Common Entrances 2021 Scheduled at



Join latest educational information @ Whatsapp Group Teacher friend.in group-1

Follow this link to join my WhatsApp group:

  https://chat.whatsapp.com/Kd2I5KSHIbDDQB9cFRJuLu

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.