Wednesday 2 June 2021

AP విద్యా విధానంలో నాలుగు అంచెలు ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ పాఠశాలలు, ప్రిలిమినరీ పాఠశాలలు, మిడిల్ స్కూళ్లు, సెకండరీ స్కూళ్లకు అధికారుల కసరత్తు

AP విద్యా విధానంలో నాలుగు అంచెలు ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ పాఠశాలలు, ప్రిలిమినరీ పాఠశాలలు, మిడిల్ స్కూళ్లు, సెకండరీ స్కూళ్లకు అధికారుల కసరత్తు

AP విద్యా విధానంలో నాలుగు అంచెలు ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ పాఠశాలలు, ప్రిలిమినరీ పాఠశాలలు, మిడిల్ స్కూళ్లు, సెకండరీ స్కూళ్లకు అధికారుల కసరత్తు| విద్యా విధానంలో నాలుగు అంచెలు అంగన్వాడీలు, ప్రీ ప్రైమరీ, ఒకటి, రెండు తరగతులతో ఫౌండేషన్ పాఠశాలలు, 3, 4, 5 తరగతులతో ప్రిలిమినరీ పాఠశాలలు, 6,7,8 తరగతులు మిడిల్ స్కూళ్లు, 9 నుంచి 12 తరగతులు సెకండరీ స్కూళ్లు అధికారుల కసరత్తు


AP విద్యా విధానంలో నాలుగు అంచెలు ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్ పాఠశాలలు, ప్రిలిమినరీ పాఠశాలలు, మిడిల్ స్కూళ్లు, సెకండరీ స్కూళ్లకు అధికారుల కసరత్తు


విద్యా రంగంలో నాలుగంచెల విధానం అమలుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకు అవసరమైన పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమం సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభమైంది. మండల, జిల్లా స్థాయి విద్యాశాఖాధి కారులు తమ పరిధిలో గల పాఠశాలలపై నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాలని తాజాగా విద్యా శాఖ డైరెక్టర్ చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్త విద్యా విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. 




దీని ప్రకారం అంగన్వాడీలు, ప్రీ ప్రైమరీ పాఠశాలలు, ఒకటి, రెండు తరగతులు వున్న పాఠశా లలు మొదటి విభాగంలోకి వస్తాయి. వీటిని ఫౌండే షన్ పాఠశాలలుగా పిలుస్తారు. 3, 4, 5 తరగతులు మాత్రమే వున్న పాఠశాలలను ప్రిలిమినరీ పాఠశా లలు అంటారు. ఇక 6,7,8 తరగతులు వున్న పాఠశా లను మిడిల్ స్కూళ్లుగా, 99 నుంచి 12 (ఇంటర్మీడియట్ వరకు తరగతులున్న పాఠశాలలను సెకండరీ స్కూళ్లుగా పేర్కొంటారు. ఫౌండేషన్ పాఠశాలలో ఒక ఎస్ఓటీతో పాటు అంగన్వాడీ టీచర్లు. ఉంటారు. ప్రస్తుతం ఎలిమెంటరీ పాఠశాలల్లో 3.4.5 తరగతుల పిల్లలను సమీపంలోని ప్రిలిమినరీ (ప్రస్తుతం ప్రాధమికోన్నత) పాఠశాలలకు తరలిస్తారు. ఇటువంటి పాఠశాలల్లో స్కూలు అసి స్టెంట్లు ఉంటారు. 


ఈ విధంగా జిల్లాలో ఎన్ని పాఠశా లలు విలీనం అవుతాయి. ఎక్కడ కొత్త భవనాలు నిర్మించవలసి ఉంటుంది? సమీపంలో విలీనం చేసే పాఠశాలలు లేకుండా ఎన్ని పాఠశాలలు ఉండిపోతు అనే వివరాలను నివేదికలో పొందుపరచవలసి వుంటుందని విద్యా శాఖ డైరెక్టర్ తన ఉత్తర్వు లలో పేర్కొన్నారు. వీటిని గూగుల్ లింకు ద్వారా విద్యా శాఖకు సమర్పిస్తే వారు రాష్ట్ర స్థాయిలో పరిస్థి తిని మదింపు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.


జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల లోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది కమీషనర్ పాఠశాల విద్య వారి ఆదేశాల మేరకు మీ పాఠశాల ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల ఉన్నచో YES అని లేనిచో NO పై గూగుల్ ఫామ్ ద్వారా వెంటనే సబ్మిట్ చేయవలెను 


https://docs.google.com/forms/d/e/1FAIpQLSf8yTqL5lmQUY40KavCP-uwvbAtlJGmK9jwSNCsybzUuDAvOw/viewform?usp=sf_link

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.