Monday 21 June 2021

AP లో కర్ఫ్యూ సడలింపుల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

AP లో కర్ఫ్యూ సడలింపుల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

కర్ఫ్యూ సడలింపుల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య నడిచే సర్వీసుల సంఖ్య పెంపు నేటి నుండి ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ సేవలు అంతే కాదు దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్లు పునరుద్దరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు


AP లో కర్ఫ్యూ సడలింపుల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం


ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపులు ఇచ్చింది. ఈ నెల 21 నుంచి అమలు కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.




ప్రభుత్వవ ఆదేశాల ప్రకారం ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించింది. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య నడిచే సర్వీసుల సంఖ్యను పెంచింది. అంతే కాదు దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్లు పునరుద్దరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే లాక్ డౌన్, కర్ఫ్యూతో ఆర్టీసీకి తీవ్ర నష్టాలు వచ్చాయి.

తాజాగా ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపు ఇవ్వడంతో సర్వీసులు పెంచడంతో ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు కాగా, రాష్ట్రంలో కరోనా వైరస తగ్గడంతో నిబంధనలు, ఆంక్షలకు రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇస్తోంది. ప్రస్తుతం అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కోవిడ్‌పై అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం జరిపారు. 

ఏపీలో జూన్ 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు సమయాన్ని ఇచ్చారు. అయితే, సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. 

కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులకు అనుమతి ఇచ్చింది. ఈనెల 21 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.