Tuesday 15 June 2021

APGPCET 2021 Vth/5th Class Admission Notification/ Online Application Examination Scheduled Dates

APGPCET 2021 Vth/5th Class Admission Notification/ Online Application Examination Scheduled Dates

APGPCET 2021 Vth/5th Class Admission Notification/ Online Application Examination Scheduled Dates | APGPCET - 2021 Admission for 5th Class Notification For the Academic year 2021 - 2022 | Andhra Pradesh Sangika Gurukula Patashala APGPCET 2021 Vth/5th Class Admission Notification Online Admission procedure and Examination pattern Scheduled Dates at official website @ https://apgpcet.apcfss.in


APGPCET 2021 Vth/5th Class Admission Notification/ Online Application Examination Scheduled Dates


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2020 - 2021 విద్యాసంవత్సరానికి గాను. లాటరీ పద్ధతి ద్వారా 5 వ తరగతి (ఇంగ్లిష్ మాద్యమం) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించ బడుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది: 14,08-2020 నుండి 31.08.2020 వరకు ఆన్ లైన్ లో apgpcet.apcfss.in ద్వారా సమర్పించాలి. ఇతర సమాచారం కొరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ కర్తలను' సంప్రదించగలరు.




Andhra Pradesh Sangika Gurukula Patashala APGPCET 2021 Vth/5th Class Admission Notification Online Admission procedure and Examination pattern Scheduled Dates at official website @ https://apgpcet.apcfss.in


అభ్యర్ధులకు సూచనలు ప్రవేశ అర్హతలు :


1) వయస్సు: యస్.సి. మరియు యస్.టి (SC, ST) విద్యార్థులు 01-09-2007 నుండి 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. ఒ.సి. బి.సి., యస్.సి. కన్వర్టైడ్ క్రిస్టియన్ (బి.సి.-సి) విద్యార్ధులు (11-09-2009 నుండి 1-08-2011 మధ్య పుట్టి ఉండాలి. 

2) 2019-2020 విద్యా సంవత్సరం ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి. పూర్తి చేసి ఉండాలి.

3) విద్యార్థులు తమ సొంత జిల్లాలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3 మరియు 4వ తరగతులు చదివి ఉండాలి. 

4) ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి సంరక్షకుల సంవత్సరాదాయము (2019-20) రూ. 1,00,000/- మించి ఉండరాదు.)


రిజర్వేషన్ల వివరాలు


1) అన్ని గురుకుల విద్యాలయాల్లో S.CC 75%, S.C. కన్వర్టడ్ క్రిస్టియన్లు 12%, S.T - 6%, B.C:-5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.

2) ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, పెట్టి దాకిరి నుండి బయట పడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, అత్యాచార బాధితులు, అనాధలు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి. 

3) వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.

4) ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీ కాని యెడల, వాటిని S.C. కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు.


గమనిక : 185 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక -A నందు ఇవ్వబడినవి. ఇతర సమాచారము కొరకు సంబంధిత ప్రధానాచార్యులను సంప్రదించవచ్చు.


దరఖాస్తు చేయు విధానం:


1) 20200-2021 విద్యా సంవత్సరానికి గాను, 5వ తరగతిలో లాటరీ పద్ధతిలో ప్రవేశానికి దరఖాస్తు: చేసుకోదలచిన విద్యార్ధులు దగ్గరలోని ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా గాని (లేదా) దగ్గరలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఏర్పాటు చేయబడిన సహాయ కేంద్రం ద్వారా గాని ఆన్ లైన్ apgpcet.apcfss.in లో తేది 14.08.2020 నుండి 31,008,2020 వరకు దరఖాస్తులు సమర్పించాలి.

2) ఎటువంటి దరఖాస్తు రుసుము స్వీకరించబడదు.

3) ఆన్ లైన్ దరఖాస్తులో విద్యార్ధి 5వ తరగతిలో చేరుటకు ఎంచుకొన్న పాఠశాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి

4) దరఖాస్తును నింపునప్పుడు అభ్యర్థి అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను. తదుపర ఏ విధమైన మార్పులు చేయబడవు. 5 దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లకు అభ్యర్ధియే పూర్తి బాధ్యత వహించాలి.

6) ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎటువంటి మార్పులు తదుపరి


IV) ఎంపిక విధానము:


2020 2021 విద్యా సంవత్సరమునకు అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో " " బాలురు మరియు బాలికల ఎంపిక, ఆన్ లైన్ విధానంలో " లాటరీ పద్ధతి ద్వారా జరుపబడును. ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు.

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం ద్వారా విద్యార్థుల అందిస్తున్న సౌకర్యాల వివరాలు పట్టిక నందు ఇవ్వబడినవి.

పట్టిక - A: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల వివరాలు (185 No.s).. పట్టిక B: జిల్లా సమన్వయ కర్తex District Co-ordinatons) ఫోన్ నెంబర్లు

పట్టిక C ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల వివరాలు


Get Download Complete Notification about APGPCET 2021 Click here


Get more information about Online Application fee details and more at official website click here



0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.