Thursday 3 June 2021

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ వాయిదా పద్దతిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆన్లైన్లో దరఖాస్తులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ వాయిదా పద్దతిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆన్లైన్లో దరఖాస్తులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ వాయిదా పద్దతిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆన్లైన్లో దరఖాస్తులు l ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్‌) గుడ్‌ న్యూస్‌ వాయిదా పద్దతిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆన్లైన్లో దరఖాస్తులు


ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్ వాయిదా పద్దతిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆన్లైన్లో దరఖాస్తులు


ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్‌) గుడ్‌ న్యూస్‌ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్‌ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో జులై మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.




రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా తొలిదశలో లక్ష వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండానే నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే నేరుగా చెల్లించేలా వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రభుత్వరంగ సంస్థల్లోని ఆసక్తిగల సిబ్బంది ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సమాచారం పంపింది. బ్యాటరీ సామర్థ్యం, వేగం ఆధారంగా వాహనాల ధర ఉంటుందని నెడ్‌క్యాప్ సంస్థ తెలిపింది.

రాష్ట్రంలో సుమారు 80 లక్షల ద్విచక్ర వాహనాలు తిరుగుతున్నాయి. ఒక్కో వాహనానికి రోజుకు సగటున అర లీటరు పెట్రోలు వంతున వాడినా, 40 లక్షల లీటర్లు అవసరం అవుతుంది. వీటివల్ల వెలువడుతున్న కాలుష్యం, కర్బన ఉద్గారాలను కొంతైనా తగ్గించడానికి విద్యుత్‌ వాహనాల వాడకాన్నిప్రోత్సహించాలని నెడ్‌క్యాప్‌ భావిస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 10 లక్షల మంది సిబ్బంది ఉండగా తొలివిడతలో లక్ష మందికి వీటిని అందిస్తుంది. నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే నేరుగా చెల్లించేలా వాహన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. మూడు సంవత్సరాల పాటు వాహనాల నిర్వహణ బాధ్యత కూడా తయారీ సంస్థదే.

ఒక్కో కిలోవాట్‌ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుందని నెడ్‌క్యాప్‌ ఎండీ రమణారెడ్డి తెలిపారు. బండి వేగాన్ని బట్టి గరిష్ఠంగా రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు సబ్సిడీ వస్తుంది. నెడ్‌క్యాప్‌ అందించే వాహనాలు గంటకు 25-55 కి.మీల వేగంతో నడవనున్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ రాయితీ సొమ్ము చెల్లిస్తుంది. వెహికల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఆమోదించిన నమూనాలను పరిశీలించి రాష్ట్రంలో విక్రయానికి పలు సంస్థలకు కేంద్రం ఆమోదం తెలిపింది.

సాధారణ ఉద్యోగి రోజుకు సగటున అర లీటరు చొప్పున నెలకు 15 లీటర్ల పెట్రోలు కొనేందుకు సుమారు రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తోం ది. విద్యుత్‌ వాహనానికి ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్‌ చేస్తే మూడు యూనిట్లు ఖర్చవుతుంది. సుమారు 100 కి.మీ ప్రయాణించవచ్చు. ఇంట్లోనే బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. పెట్రోలుకు వెచ్చించే మొత్తానికి ఇంకొంత కలిపితే నెలవాయిదా సరిపోతుందిఅనిఅధికారులు చెబుతున్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.