Friday 4 June 2021

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో నామకరణం

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో నామకరణం

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో నామకరణం| తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాజకీయ పార్టీని నమోదు చేశారు


తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో నామకరణం


ఏపీ సీఎం జగన్ సోదరి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు చకచకా పావులు కదుపుతున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆమె పార్టీ పేరును, జెండాను, సిద్ధాంతాన్ని ప్రకటిస్తామని గతంలోనే తెలిపిన విషయం తెలిసిందే. 




ఈ నేపథ్యంలో, షర్మిల ముఖ్య అనుచరుడు రాజగోపాల్ 'వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాజకీయ పార్టీని నమోదు చేశారు. దీనికి ఈసీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. షర్మిల స్థాపించబోయే నూతన పార్టీ ఇదేనని ప్రచారం జరుగుతోంది.

కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను రాజగోపాల్ సీఈసీకి సమర్పించారు. పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ పార్టీ చైర్మన్ హోదాలో రాజగోపాల్ పత్రికా ప్రకటన కూడా ఇచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే షర్మిల అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి. 

ప్రస్తుతం కరోనా కావడంతో వివిధ వర్గాల వారితో వర్చువల్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.