Monday 28 June 2021

మన బడి నాడు - నేడు వివిధ రిజిస్టర్ల నిర్వహణ బుక్ కీపింగ్ నిర్వహణ వివరాలు

మన బడి నాడు - నేడు వివిధ రిజిస్టర్ల నిర్వహణ బుక్ కీపింగ్ నిర్వహణ వివరాలు

మన బడి నాడు - నేడు వివిధ రిజిస్టర్ల నిర్వహణ బుక్ కీపింగ్ నిర్వహణ వివరాలు | Phase -2 మన బడి నాడు - నేడు కార్యక్రమంలో నిర్వహించే వివిధ రిజిస్టర్లు బుక్ కీపింగ్ నిర్వహణా విధానం తీర్మానాలు నిర్వహణ వివరాలు PDF File Download

మన బడి నాడు - నేడు వివిధ రిజిస్టర్ల నిర్వహణ బుక్ కీపింగ్ నిర్వహణ వివరాలు 

పాఠశాల విద్యా శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తల్లిదండ్రులు/ పాఠశాల/ అభివృద్ధి కమిటీ /కళాశాల అభివృద్ధి కమిటీ/హాస్టల్ అభివృద్ధి కమిటీ ఖర్చు చేసిన ప్రతి రూపాయినీ లెక్కించడానికి పుస్తకాలలో రికార్డుల (బుక్ కీపింగ్) వ్యవస్థను నిర్వహించాలి. "ఖాతాల పుస్తకాలను రాయడానికి వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ (గ్రామ/ వార్డ్ సచివాలయం) సేవలు వినియోగించుకోవాలి.




మన పాఠశాల/ కళాశాలలో కొత్త నిర్మాణాలు, మరమ్మత్తులు మనమే చేసుకుందామని అనుకుంటే, కొన్ని ఆర్థికపరమైన అంశాల గురించి మరియు నిర్వహించాల్సిన రిజిస్టర్ల గురించి తెలుసుకోవాలి.

పాఠశాల విద్యా శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించవలసిన వివిధ ముఖ్యమైన రిజిస్టర్లు (ఫైనాన్సియల్) PC/SDC/CDC/ HDC యొక్క మినిట్స్ / తీర్మానాల పుస్తకం

ఫండ్స్ రిసీవ్డ్ రిజిస్టర్ 

కాష్ బుక్ (జమలు చెల్లింపులకు సంభందించిన ఓచర్లు)

సాధారణ లేడ్జర్

చెక్ ఇష్యూ /బిల్ రిజిస్టర్

బ్యాంకు చెల్లింపు ఓచర్

స్టాక్ నమోదు- పంపిణీ రిజిస్టర్

ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్ బ్యాంకు పాస్ బుక్

బ్యాంకు రీకంసిలేసన్ స్టేట్మెంట్

పే బిల్ రిజిస్టర్

ఆల్ పర్చేజ్ రిజిస్టర్ 

ప్రొసీడింగ్స్ అఫ్ ట్రాన్స్ఫర్ అఫ్ మెటిరియల్ (TED)

ప్రొసీడింగ్స్ అఫ్ TEO (Funds)


మినిట్స్ /తీర్మానాల పుస్తకం


తీర్మాన పుస్తకం అన్ని పుస్తకాలకు తల్లిలాంటిది తల్లిదండ్రులు/ పాఠశాల అభివృద్ధి కమిటీ / కళాశాల అభివృద్ధి కమిటీ / హాస్టల్ అభివృద్ధి కమిటీ చేసే ప్రతి కార్యక్రమము మరియు ప్రతి లావాదేవీలు సభ్యుల ఆమోదం పొందాలి. తీర్మానం నమోదు చేసిన తరువాత సభ్యుల సంతకాలు పెట్టించుకోవాలి.

ఏడుగురు సభ్యుల కన్నా తక్కువ హాజరైతే ఎలాంటి తీర్మానాలు తీసుకోకూడదు గత సమావేశాలలో జరిగిన నిర్ణయాలు అమలయ్యాయా? లేదా ? లేనిచో కారణాలు చర్చించి నమోదు చేయాలి.


ఉదాహరణకు - తీర్మానం


తేదీ: 16-03-2021పలాస ఎంపీపీఎస్ పాఠశాలలో ఉదయం పది గంటలకు తల్లిదండ్రుల కమిటీ సమావేశం జరిగింది. మొత్తం - -సభ్యులకుగాను. --హాజరయ్యారు. సమావేశంలో పాఠశాల/ కళాశాల/హాస్టల్ నిర్మాణం, మరమతుల విషయమై చర్చించి కింది తీర్మానాన్ని ప్రతిపాదించడమైనది.

"మన బడి నాడు- నేడు"లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాల భవన నిర్మాణం/ మరమ్మత్తు కార్యక్రమాలను - గదులు, మరుగుదొడ్డి, గోడల పెయింటింగ్ చేయించుటను తల్లిదండ్రులు, పాఠశాల అభివృద్ధి కమిటీ/కళాశాల అభివృద్ధి కమిటీ /హాస్టల్ అభివృద్ధి కమిటీ చేపడుతుంది. ఏ కాంట్రాక్టర్ కు అప్పగించబడదని ఏకగ్రీవంగా తీర్మానించడమైనది."


కన్వీనర్ సంతకం

కమిటీ సభ్యుల సంతకాలు


తీర్మానం:2  తేదీ  02-03-2021.


పలాస ఎంపీపీ పాఠశాలలో ఉదయం పది గంటలకు తల్లిదండ్రుల కమిటీ సమావేశం జరిగింది. మొత్తం సభ్యులకుగాను. --హాజరయ్యారు. సమావేశంలో పాఠశాల/కళాశాల /హాస్టల్ తరగతి గదుల నిర్మాణం/ మరమ్మత్తుల విషయమై చర్చించి కింది తీర్మానాన్ని ప్రతిపాదించడమైనది.

"మన బడి నాడు- నేడు"లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాల/ కళాశాల/హాస్టల్ గది నిర్మాణం మరమ్మతు కార్యక్రమాలను చేపట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్న మేస్త్రి చేసిన పని సంతృప్తికంగా ఉన్నందున మేస్త్రికి మొదటి విడత చెల్లింపుగా రూ. --- చెల్లించడానికి తీర్మానించడమైనది.


కన్వీనర్ సంతకం

కమిటీ సభ్యుల సంతకాలు


కాష్ (నగదు) బుక్


పాఠశాల/ కళాశాలలో జరిగే ప్రతి లావాదేవీలను ఏ రోజుకారోజు రాసే పుస్తకాన్ని నగదు

నగదు పుస్తకంలో ఏ రోజుకి ఆ రోజు నిల్వలు తేల్చాలి..

పుస్తకంలో ఎడమవైపు జమలు, కుడివైపు ఖర్చులు రాయాలి.


నగదు పుస్తకం వల్ల ఉపయోగాలు:


ప్రతి రూపాయి రాకడ, పోకడ (వచ్చే రూపాయి ఖర్చు పెట్టిన రూపాయి ) తెలుస్తుంది.

నగదు పుస్తకంలో ప్రారంభ నిల్వ, ముగింపు నిల్వ తెలుస్తుంది.

ప్రతి సమావేశం నాటికి జమలు మరియు చెల్లింపు వివరాలు తల్లిదండ్రులు/ కళాశాల అభివృద్ధి కమిటీకి తెలుస్తుంది.

నగదు పుస్తకం ఆధారంగానే జనరల్ లెడ్జర్ పుస్తకం రాస్తారు.

నగదు పుస్తకం (క్యాష్ బుక్) నమూనా కింది విధంగా ఉంటుంది.


నగదు పుస్తకంలో గమనించవలసిన అంశాలు:


ప్రారంభ నిల్వ ఎంత ఉంది ? ముగింపు నిల్వ ఎంత ఉంది? ప్రతి లావాదేవీల నిర్వహణను నగదు పుస్తకంలో రాస్తున్నారా?

ఎడమ వైపు జమలు, కుడి వైపు చెల్లింపులు ఉన్నాయా?

నగదు పుస్తకంలో అంకెలు దిద్దకుండా, పెన్నుతో రాస్తున్నారా?

నగదు పుస్తకంలోని ముగింపు నిల్వలు, బ్యాంకు స్టేట్మెంట్ లోని ముగింపు నిల్వలకు సరిపోయిందా? సరిపోకపోతే కారణాలు తెలుసుకోవాలి.


సాధారణ లెడ్జర్


పాఠశాల/ కళాశాల/హాస్టల్ మరమ్మత్తు/ నిర్మాణ ప్రక్రియలో జరిగిన లావాదేవీలు (జమలు /చెల్లింపులు ) వివరాలను వేర్వేరు ఖాతాలలో రాసే పుస్తకాన్ని జనరల్ లెడ్జర్

జనరల్ లెడ్జర్ లో ప్రతి సామాగ్రికి కొన్ని పేజీలను కేటాయించుకుని క్యాష్ బుక్ లో జరిగిన ప్రతి లావాదేవీలను, సామాగ్రి వారీగా లెడ్జర్ లో ఓచర్ నెంబర్లతో సహా నమోదు చేసుకోవాలి.


సాధారణ లెడ్జర్ ఉపయోగాలు:


ఇది రాయడం వలన సంస్థలో జరిగిన ఆర్థిక లావాదేవీల యొక్క అంతిమ నిల్వలు తెలుసుకోవచ్చు.

ఈ లెడ్జర్ నందు ఖాతా శీర్షికల వివరాలు మొత్తాలు విడివిడిగా తెలుస్తాయి.

సామాజిక తనిఖీలలో ఇది బాగా ఉపయోగపడుతుంది.


సాధారణ లెడ్జర్ లో గమనించవలసిన అంశాలు:


నగదు పుస్తకంలో నమోదు చేసిన వెంటనే సాధారణ లెడ్జర్ లో ఖాతా వారీగా రాశారా? లేదా?

ఖాతా వారీగా విషయ సూచికలో కేటాయించిన పేజీలకు అనుగుణంగా రాశారా?

నగదు పుస్తకంలోని పేజీ నెంబర్ సాధారణ లెడ్జర్ లోను, సాధారణ లెడ్జర్ పేజీ నెంబర్ నగదు పుస్తకంలోను రాశారా? లేదా?

ప్రధాన ఖాతాలలో ఎక్కువ ఖర్చు జరుగుతున్న ఖాతా ఏమిటి? ఎందుకు జరుగుతున్నదో పరిశీలించాలి.


గమనిక : నగదు పుస్తకం లో రాసిన ప్రతి లావాదేవి ఈ సాధారణ లేడ్జర్ లో నమోదు చేయవలెను.


చెక్కు నమోదు నమోదు online UTR/ రిజిస్టరు:


పాఠశాల/ కళాశాల/హాస్టల్ స్థాయిలో చెక్కుల ద్వారా జరిపే బ్యాంకు లావాదేవీలన్నీ ఈ రిజిస్టర్లో చెక్కు నెంబర్, తేదీలతో సహా నమోదు చేయాలి. చెక్కు నమోదు రిజిస్టర్ * నమోదు నమూనా ఈ క్రింది విధంగా వుంటుంది. బ్యాంకు ఖాతా, పాస్ పుస్తకము, చెక్ పుస్తకముల నిర్వహణ:

పాఠశాల/ కళాశాల అభివృద్ధి కమిటీ బ్యాంకు పాస్ పుస్తకాన్ని ప్రతి నెలా అప్డేట్ చేయించుకోవాలి. పాస్ పుస్తకము, చెక్ పుస్తకము, రిజిస్టర్లను అల్మారాలో భద్రంగా ఉంచుకోవాలి.

కమిటీ సభ్యులు అందరూ చెక్ పై సంతకం చేసే ముందు, తీర్మానం ఉందా? నిర్మాణంలో ప్రగతి సాధించామా? బిల్లులు, వోచర్లు సక్రమంగా ఉన్నాయా? మొదలగు అంశాలను పరిశీలించుకోవాలి.


బ్యాంకు ఖాతా, పాస్ పుస్తకము, చెక్ పుస్తకముల నిర్వహణ:


పాఠశాల/ కళాశాల అభివృద్ధి కమిటీ బ్యాంకు పాస్ పుస్తకాన్ని ప్రతి నెలా అప్డేట్ చేయించుకోవాలి.

పాస్ పుస్తకము, చెక్ పుస్తకము, రిజిస్టర్లను అల్మారాలో భద్రంగా ఉంచుకోవాలి.

కమిటీ సభ్యులు అందరూ చెక్ పై సంతకం చేసే ముందు, తీర్మానం ఉందా? నిర్మాణంలో ప్రగతి సాధించామా? బిల్లులు, వోచర్లు సక్రమంగా ఉన్నాయా? మొదలగు అంశాలను పరిశీలించుకోవాలి.


స్టాక్ నమోదు- పంపిణీ


పాఠశాల/ కళాశాల నిర్మాణ ప్రక్రియలో కొనుగోలు చేసిన వస్తువుల వివరాలను నమోదు చేసుకోవడానికి ఈ పుస్తకమును కచ్చితంగా నిర్వహించాలి.

స్టాక్ కొనుగోలు వివరాలు పూర్తిగా రాయవలెను. ఏ వస్తువు, ఎప్పుడు కొనుగోలు చేసింది? బ్రాండు వివరం, బిల్ నెంబర్, సరఫరాదారులు ఎవరు?

వస్తువులు పంపిణీ చేసిన తరువాత కూడా స్టాక్ నిల్వ ఎంత ఉందో రిజిస్టర్ లో రాసుకోవాలి.

నెలకు ఒకసారి స్టాక్ తనిఖీ చేయించి, కమిటీ నివేదికలు భద్రపరుచుకోవాలి.

తనిఖీ అధికారులు ఈ రిజిస్టర్ ద్వారా వస్తువు ముగింపు నిల్వ, వాస్తవ నిల్వలతో సరిపోల్చుకోవాలి.


Get Download Manabadi Nadu Nedu Complete registers book keeping PDF File Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.