Monday 21 June 2021

ఉమంగ్‌ మొబైల్‌ యాప్‌ లో కొవిన్‌ సేవలు

ఉమంగ్‌ మొబైల్‌ యాప్‌ లో కొవిన్‌ సేవలు

ఉమంగ్‌ మొబైల్‌ యాప్‌ లో కొవిన్‌ సేవలు తప్పులు సరిదిద్దుకునే అవకాశం వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లూ లభ్యం


ఉమంగ్‌ మొబైల్‌ యాప్‌ లో కొవిన్‌ సేవలు 


ప్రజలకు వివిధ రకాల సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉమంగ్‌’ మొబైల్‌ యాప్‌లో ఇప్పుడు కొవిన్‌ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఉమంగ్‌ యాప్‌లోని సర్వీసెస్‌ క్యాటగిరీలో హెల్త్‌ సెక్షన్‌ కింద మొదటి వరసలో ఆయుష్మాన్‌ భారత్‌, రెండో వరుసలో కొవిన్‌ సేవలు ఉంటాయి. కొవిన్‌ బాక్స్‌పై క్లిక్‌చేయగానే రిజిస్టర్‌ లేదా లాగిన్‌ ఫర్‌ వ్యాక్సినేషన్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. 




అందులో మీ మొబైల్‌ నంబరును ఎంటర్‌ చేయగానే ఆ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత లాగిన్‌ అయి వ్యాక్సినేషన్‌ సేవలను పొందవచ్చు. పిన్‌ కోడ్‌, లేదా జిల్లా పేరును ఎంటర్‌ చేయడం ద్వారా మీకు సమీపంలో ఉన్న వ్యాక్సినేషన్‌ కేంద్రాల వివరాలను తెలుసుకోవచ్చు. 

ఇప్పటికే వ్యాక్సిన్‌ వేయించుకుంటే డౌన్‌లోడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఎంచుకొని మీ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేసిన వెంటనే సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. వీటితోపాటు కొవిడ్‌కు సంబంధించి మీకేమైనా సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చు. ఇందుకోసం కొవిన్‌ హెల్ప్‌డెస్క్‌ నంబరు 1075, ఈ-మెయిల్‌ ఐడీ support@cowin.gov.in అందుబాటులో ఉంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.