Saturday 26 June 2021

పది ఇంటర్ ఫలితాల వెల్లడికి నిపుణుల కమిటీ

పది ఇంటర్ ఫలితాల వెల్లడికి నిపుణుల కమిటీ

పది ఇంటర్ ఫలితాల వెల్లడికి నిపుణుల కమిటీ విద్యాశాఖ ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దృశ్యమాధ్యమ సమీక్ష


పది ఇంటర్ ఫలితాల వెల్లడికి నిపుణుల కమిటీ


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దుతో పరీక్షా ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. 




ఫలితాల వెల్లడి కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలను వెల్లడించేందుకు మూల్యాంకనం ఎలా ఉండాలన్న దానిపై నిపుణుల కమిటీ నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు. 

మరోవైపు ప్రపంచబ్యాంకు నిధులతో ప్రాథమిక విద్యాబోధన ప్రాజెక్టు, విద్యాకానుక అమలు అంశాలపైనా చర్చించారు. 2021-22 విద్యా సంవత్సరం క్యాలెండర్ తయారీ, పాఠశాలలను తెరిచే అంశంపైనా సమీక్షించారు. 

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తితో పాటు మూడో వేవ్ ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో పాఠశాలలు తెరవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవలంబించాల్సిన విధివిధానాలపై అధికారులతో చర్చించారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.