Monday 21 June 2021

థర్డ్ వేవ్ కంటే ముందే చిన్నారుల పై కరోనా పంజా

థర్డ్ వేవ్ కంటే ముందే చిన్నారుల పై కరోనా పంజా

థర్డ్ వేవ్ కంటే ముందే చిన్నారుల పై కరోనా పంజా 12, 13 ఏళ్ల చిన్నారుల ఊపిరితిత్తుల్లో వైరస్ ఇన్ఫెక్షన్ పాఠశాలలు తెరిచే అంశంపై పునరాలోచించాలి - ముండ్న్నాహ్లఏపై


థర్డ్ వేవ్ కంటే ముందే చిన్నారుల పై కరోనా పంజా


థర్డ్ వేవ్లో చిన్నారులపై వైరస్ పంజా విసరడం కాదని ఇప్పటికే అది ప్రారంభమైందన్నారు చాలా పీడియాట్రిషన్స్ కరోనా సోకిన చిన్నారులకు వైద్యం అందిస్తున్నట్లు చెబుతున్నారని వివరిస్తున్నారు. గతంలో కరోనా సోకినా చిన్నారులు తేలికపాటి చికిత్సతో కోలుకునే వారని, కానీ ఇప్పుడు కొన్ని కేసుల్లో 12 13 ఏళ్ల చిన్నారులు కూడా ఊపరితిత్తుల్లో వైరస్ ఇన్ఫిక్షన్తో బాధపడుతున్నారని హెచ్చరిస్తున్నారు. 

చిన్నారుల ప్రాణాలను తీసే బ్రెజిల్ కరోనా వేరియంట్ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్లోనే ఈ వేరియంట్ కేసులు దేశంలో వెలుగు చూసినట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయని గుర్తు చేస్తున్నారు. 




సెకండ్ వేవ్లో చిన్నారులపైనా వైరస్ ప్రభావానికి డెల్టా వేరియంటే కారణమని స్పష్టం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా కరోనా వైరస్ రానున్న రోజుల్లో మరెంతమంది చిన్నారులను బలితీసుకుంటుందోనన్న విషయంలో ప్రభుత్వాల దగ్గర ఒక అంతరాలు లేకపోవడం బాధాకరమంటున్నారు. 

ఈ పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడం, పరీక్షలు నిర్వహించడం సరికాదంటున్నారు. ఓ పక్కన థర్డ్ వేన్లో చిన్నారులపై వైరస్ పంజా విసరకుండా ఓ పక్కన పీడియాట్రిక్ కొవిడ్ వార్డులు ఏర్పాటు చేస్తూ మరో పక్కన స్కూళ్లు తెరవడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు పాఠశాలలు తిరిగి ప్రారంభంపై మరోసారి ఆలోచించాలని, ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలని సూచిస్తున్నారు. 

పరీక్షల నిర్వహణలోనూ సమూల మార్పులు తేవాలని, లేనిపక్షంలో పిల్లలలపై కఠిన వైరస్ దాడిచేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐసీయూలో, ఆక్సిజన్ బెడ్లపై చేరుతున్న పేషెంట్ల తాకిడి కొనసాగుతోందని గుర్తు చేస్తున్నారు.

ఇంట్లోని పిల్లలపై వైరస్ దాడిచేస్తే వైద్య సిబ్బంది చేతులెత్తేసే ప్రమాదం

కరోనా వైరసకు వైద్యులు చికిత్స అందించగలరే కాని వైరస్ వ్యాప్తిని నియంత్రించే శక్తి మాత్రం ప్రభుత్వాల నిర్ణయాలకే ఉంటుందని ప్రముఖ పల్మనాలజిస్టు డా. రఘురామ్ స్పష్టం చేస్తున్నారు ఇంట్లోని పిల్లల ప్రాణాలను బలిగొనే వైరస్ వేరియంట్లు ప్రబలితే వైద్యులు, వైద్యు సిబ్బంది చేతులెత్తేసే ప్రమాదముందని చెబుతున్నారు. 

ఆ పరిస్థితులే వస్తే ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలు తుందంటున్నారు. కరోనా మొదట్విన్లో వైరస్ కాస్తా తగ్గుముఖం పట్టగానే ప్రజలు కరోనా జాగ్రత్తలను గాలికొదిలేసినందునే సెకండ్వేన్లో వయస్సుతో నిమిత్తం లేకుండా చాలామంది ఊపిరిపీల్చుకోలేని పరిస్థితుల్లో కన్నుమూశారని గుర్తు చేస్తున్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.