Engineering PHD/ME/ MTECH/BE పూర్తి చేసిన వారికి Deep Learning IIT 7 వారాల ఆన్‌లైన్ కోర్సు ఇలా దరఖాస్తు చేసుకోండి సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ, ఎంఈ/ ఎంటెక్, బీఈ/బీటెక్ పూర్తయినవారు లేదా మూడు, నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు డీప్ లెర్నింగ్‌లో లోతైన అభ్యాసం, అవగాహన పెంచుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది మరోవైపు, ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించాలనుకునే ప్రొఫెషనల్స్ కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జూన్ 20లోపు www.iitgoa.ac.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.
Engineering PHD/ME/ MTECH/BE పూర్తి చేసిన వారికి Deep Learning IIT 7 వారాల ఆన్‌లైన్ కోర్సు
తాజాగా, ఐఐటీ మద్రాస్, ఐఐటి గోవా, ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐటి పాలక్కాడ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు డీప్ లెర్నింగ్‌పై 7 వారాల ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించాయి. సిడ్యాక్ భాగస్వామ్యంతో ఈ ఆన్‌లైన్ కోర్సును డిజైన్ చేశాయి. ఆసక్తిగల విద్యార్థులు రూ .500, మిగతా వారు రూ. 2000 నామమాత్రపు రుసుము చెల్లించి ఈ కోర్సులకు రిజిస్టర్ చేసుకోవచ్చు.
కోర్సు ముగింపులో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో, టాప్ వచ్చిన విద్యార్థులకు పుస్తకాలను బహుమతిగా అందిస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు గ్రేడ్‌లతో సర్టిఫికేట్ అందజేస్తారు. వీటితో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఈ కోర్సు ఈ నెలాఖరున ప్రారంభమై, ఆగస్టులో ముగుస్తుంది.
ఎవరెవరు అర్హులు?
సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ, ఎంఈ/ ఎంటెక్, బీఈ/బీటెక్ పూర్తయినవారు లేదా మూడు, నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, విద్యార్థులకు పైథాన్, ప్రాబబిలిటీ, కాలిక్యులస్, లీనియర్ ఆల్జీబ్రా, మాట్రిక్స్ బేసిక్స్పై కనీస అవగాహన ఉండాలి. మరోవైపు, ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించాలనుకునే ప్రొఫెషనల్స్ కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏమేం బోధిస్తారు?
డీప్ లెర్నింగ్‌లో లోతైన అభ్యాసం, అవగాహన పెంచుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. కోర్సులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హిస్టరీ, మెషిన్ లెర్నింగ్ ప్రైమర్, న్యూరల్ నెట్‌వర్క్ బేసిక్స్, ఆప్టిమైజేషన్ మెథడ్స్, రెగ్యులరైజేషన్ మెథడ్స్, ఆటోఅసోసియేటివ్ న్యూరల్ నెట్‌వర్క్‌లు, కన్వల్యూషన్ న్యూరల్ నెట్‌వర్క్, డీప్ లెన్నింగ్ ఫర్ ఎడ్జ్ డివైజెస్, హెచ్‌పిసి ఫర్ ఏఐ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, డీప్ క్యూ లెర్నింగ్ వంటి అంశాలపై బేసిక్స్ నేర్పిస్తారు
ఎలా నమోదు చేసుకోవాలి?
ఆసక్తి గల అభ్యర్థులు 2021 జూన్ 20లోపు www.iitgoa.ac.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. విద్యార్థులు వారి ఐడి కార్డు స్కాన్ కాపీ, వారి డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లెటర్ అప్లోడ్ చేయాలి.
ఈ ఆన్‌లైన్ క్లాసులను ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం సాయంత్రం 5:00 నుంచి 6:00 గంటల వరకు నిర్వహిస్తారు. ఆ తరువాత 30 నిమిషాల పాటు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది
Get More Information at official website click here
Get Registration and more information about official website click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.