Tuesday 1 June 2021

SBI తో పాటు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఓ కీలక నిర్ణయం కరోనా చికిత్సకు శాలరీ, నాన్ శాలరీ ఖాతాదారులతో పాటు పెన్షనర్లు రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం

SBI తో పాటు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఓ కీలక నిర్ణయం కరోనా చికిత్సకు శాలరీ, నాన్ శాలరీ ఖాతాదారులతో పాటు పెన్షనర్లు రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు

SBI తో పాటు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఓ కీలక నిర్ణయం కరోనా చికిత్సకు శాలరీ, నాన్ శాలరీ ఖాతాదారులతో పాటు పెన్షనర్లు రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం|కరోనా చికిత్సకు రూ.5లక్షల రుణం కనీసం రూ.25 వేల రుణం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఎస్బీఐ వెల్లడి| కరోనా చికిత్సకు రూ.5లక్షల రుణం పూచీకత్తు లేకుండా కేటాయింపు వేతన వేతనేతర ఉద్యోగులకు వర్తింపు


SBI తో పాటు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఓ కీలక నిర్ణయం కరోనా చికిత్సకు శాలరీ, నాన్ శాలరీ ఖాతాదారులతో పాటు పెన్షనర్లు రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం


న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనాతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతున్న వేళ ఎసీఐతో పాటు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బుల్లేకపో వడంతో కరోనా బాధితులు మెరుగైన వైద్యానికి దూరం అవుతున్నారన్న విషయం తెలుసుకుని అలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చాయి. కరోనా చికిత్స కోసం రూ. 5 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పించాయి. 




అయితే ఈ రుణం పొందేందుకు ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించాయి. మెడికల్ సర్వీసులకు ఆర్బీఐ, రూ.50,000 కోట్ల లిక్విడిటీ సదుపాయాన్ని కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. శాలరీ, నాన్ శాలరీ ఖాతాదారులతో పాటు పెన్షనర్లు రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందేందుకు అర్హులని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.


ఈసీ జీఎల్ఎస్తోనూ రుణం


రిజర్వ్ బ్యాంక్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. కొత్తగా తీసుకొచ్చిన కోవిడ్ లోన్ బుక్ లో భాగంగా.. అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం (ఈసీజీఎల్ఎస్)ను తీసుకొచ్చిం ది. ఈ స్కీం ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందు కుబ్యాంకుల వద్ద రుణాలు తీసుకోవచ్చు. ఇలాంటి వారికి 7.5 శాతం వడ్డీతో రూ.2కోట్ల వరకు రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపాయి. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్లు ఈ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు అర్హులు అనిఐబీఏ, ఎస్బీఐ తెలిపాయి. వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు


కల్పించడంతో పాటు విస్తరింపజేసేందుకు, ఆరోగ్య సంరక్షణ పరికరాలు తయారీదారులకు రూ.100 కోట్ల వరకు వ్యాపారమైన రుణాలు అందించబడుతాయని వివరించా యి. కోవిడ్ చికిత్స కోసం రూ. 5 లక్షల వరకు గరిష్యంగా ఎలాంటి పూచీకత్తు లేని రుణ సదుపాయం కల్పించబడు తున్నట్టు వివరించాయి. భారత్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ స్పందించి రూ.50 ,000 కోట్ల లిక్విడిటీ సాయాన్ని అందించింది. వైద్య ఆరోగ్య శాఖ రంగాన్ని మరింత అభివృద్ధి పర్చాలన్న లక్ష్యంతో.. ఈ నిర్ణయం తీసుకుంది.


తగ్గనున్న ఒత్తిడి


అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి రావడంతో ఈ సాయం అందించేందుకు దోహదపడిందని ఎస్బీఐ తెలిపింది. రుణాల ద్వారా కోవిడ్ ప్రభావిత విభాగాలపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడింది. అదేవిధంగా ఆర్థికపరమైన ప్రభావం కూడా తగ్గుతుందని వివరించింది. కరోనా చికిత్సతో పాటు ఆక్సిజన్' ప్లాంట్ల నిర్మాణం కోసం అందించే రుణాల ద్వారా తాము పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. అదేవిధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహాపరిశ్రమలను ఆదుఁ పనేందుకు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకొచ్చాయి. ఈ మేరకు కొత్త విధానాన్ని రూపొందించాయి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.