Sunday 25 July 2021

ఆగస్టు 16 నుంచి డిగ్రీ విద్యార్థులకు టీకా..!

ఆగస్టు 16 నుంచి డిగ్రీ విద్యార్థులకు టీకా..!

ఆగస్టు 16 నుంచి డిగ్రీ విద్యార్థులకు టీకా..! ఆగస్టు 16 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజు నుంచే డిగ్రీ విద్యార్ధులకు కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు


ఆగస్టు 16 నుంచి డిగ్రీ విద్యార్థులకు టీకా..! 


ఆగస్టు 16 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రోజు నుంచే డిగ్రీ విద్యార్ధులకు కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఈ మేరకు కళాశాలల్లోనే వ్యాక్సినేషన్‌ శిబిరాలను ఏర్పాటు చేయడానికి వైద్యఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 2.92 లక్షల మండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులున్నారని అంచనా. కళాశాలలకు వెళ్లి వేయడం వల్ల వీరందరికి త్వరగా వేయడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.




మరోవైపు ఆగస్టు 16కంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా విద్యాసంస్థల సిబ్బంది ఇప్పటి వరకూ ఎంత మంది రెండు డోసులు టీకా వేసుకున్నారు? ఎంత మంది తొలిడోసు టీకా వేసుకున్నారు.? ఇంకా ఎన్ని టీకాలు అవసరం అన్న వివరాలను అధికారయంత్రాంగం సేకరిస్తోంది. పూర్తిస్థాయి వివరాలు వచ్చిన తరువాత ప్రత్యేక డ్రైవ్‌గా ఉపాధ్యాయులకు.

ఇతర సిబ్బందికి టీకాలు వేయనున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల్లో పని చేస్తున్న 1,68,911 మంది ఉపాధ్యాయుల్లో ఈ నెల 22వ తేదీ నాటికి తొలి విడత వ్యాక్సిన్‌ 83,394 (49.37శాతం) మంది వేయించుకున్నారు రెండో విడత వ్యాక్సినేషన్‌ 59,056 (34.96శాతం) మందికి జరిగింది.

ఒక డోసు పూర్తయిన వారికి రెండోది అసలు వేసుకోని వారికి తొలిడోసు టీకాను ఈ నెల 31లోగా వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు

3.72 లక్షల కొవిడ్ టీకా డోసులు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నాయి పుణె సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. 

ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 31 బాక్సుల్లో రాష్ట్రానికి టీకా డోసులు తరలివచ్చాయి.

తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్‌ను అధికారులు తరలించారు అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ జిల్లాలకు తరలివెళ్లనుంది తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభించింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.