Thursday 15 July 2021

నేటి నుంచి పాఠశాలల్లో అడ్మిషన్లు 27 నుంచి బేస్ లైన్ టెస్ట్ షెడ్యూల్ ప్రకారమే టీవీ,రేడియో క్లాసులు సవరించిన ఉత్తర్వులు

నేటి నుంచి పాఠశాలల్లో అడ్మిషన్లు 27 నుంచి బేస్ లైన్ టెస్ట్ షెడ్యూల్ ప్రకారమే టీవీ,రేడియో క్లాసులు సవరించిన ఉత్తర్వులు

నేటి నుంచి పాఠశాలల్లో అడ్మిషన్లు 27 నుంచి బేస్ లైన్ టెస్ట్ షెడ్యూల్ ప్రకారమే టీవీ,రేడియో క్లాసులు సవరించిన ఉత్తర్వులు విద్యార్థులను ఎట్టి పరిస్థితులలోనూ పాఠశాలలకు పిలిపించారాదు. తల్లిదండ్రుల ద్వారా వారి పిల్లలకు బేస్ లైన్ పరీక్ష పేపర్లు పంపవలెను పాఠశాలల మ్యాపింగ్కు ఆదేశాలు


నేటి నుంచి పాఠశాలల్లో అడ్మిషన్లు 27 నుంచి బేస్ లైన్ టెస్ట్ షెడ్యూల్ ప్రకారమే టీవీ, రేడియో క్లాసులు


రాష్ట్రంలో ఆగస్టు రెండో వారం నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిం చాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్య సంచాలకులు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అలాగే ఈ నెల 27వ తేదీ నుంచి 31 వరకు బేస్ లైన్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. 28 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు బేస్ లైన్ టెస్ట్ ఎవాల్యూషన్ నిర్వహించాలన్నారు. 




ప్రాథమిక తరగతు లకు సంబంధించి ఆగస్టు రెండో తేదీ నుంచి ఏదో తేదీ వరకు ముందు చదివిన తరగతిలోని అంశాలపై ప్రాక్టీస్ నిర్వహించాలని సూచించారు. 

నాలుగో తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు వరేట్ ప్రాక్టీస్ చేయించాలన్నారు. ఆగస్టు 9 నుంచి 31 వరకు ప్రాథమిక తరగతుల వర్క్ షీట్స్పై ప్రాక్టీస్ నిర్వహించాలని, వీటితో పాటుగా ముందే ప్రకటించిన విధంగా రేడియో, టీవీ పాఠా లను కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి, ఎనిమిదో తరగతి అడ్మిషన్లు తీసుకునే సమయంలో ప్రధానోపాధ్యా యులు తప్పనిసరిగా తల్లిదండ్రుల నుంచి రాతపూ ర్వక అనుమతిని తీసుకోవాలని, తద్వారా డ్రాప వుట్లను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.


పాఠశాలల మ్యాపింగ్కు ఆదేశాలు


రాష్ట్రంలో నూతన జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా ప్రాథమిక తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ చేపడుతోంది. అందుకోసం ఉన్నత పాఠశాలల ఆవరణలో ఉన్న ప్రాథమిక పాఠశాలల సంఖ్యను నమోదు చేయాలని ఆదేశించారు

School preparedness and teaching learning process for the Academic Year 2021-22 – Certain instructions issued – Regarding RC.151 Dt:14.07.2





0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.