Sunday 4 July 2021

ATM cardless cash withdrawal ఏటీఎం కార్డు లేకుండా డ‌బ్బు విత్‌డ్రా ఎలా చేయాలి

ATM cardless cash withdrawal ఏటీఎం కార్డు లేకుండా డ‌బ్బు విత్‌డ్రా ఎలా చేయాలి,ATM cardless cash withdrawal Process in various Bank ATMs

ATM cardless cash withdrawal ఏటీఎం కార్డు లేకుండా డ‌బ్బు విత్‌డ్రా ఎలా చేయాలి ఎస్బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, కొట‌క్ మ‌హీంద్రా స‌హా ఇలా చాలా బ్యాంకులు కార్డు ర‌హితంగా న‌గ‌దు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్నాయి | ATM cardless cash withdrawal Process in various Bank ATMs


ATM cardless cash withdrawal ఏటీఎం కార్డు లేకుండా డ‌బ్బు విత్‌డ్రా ఎలా చేయాలి


అర్జెంట్‌గా డ‌బ్బు అవ‌స‌రం ప‌డింది  ఏటీఎం నుంచి డ‌బ్బు విత్ డ్రా చేద్దామంటే చేతిలో డెబిట్ కార్డు లేదు అప్పుడేం చేస్తారు ఎవ‌రికో ఒక‌రికి ఫోన్ చేసి వాళ్లు డ‌బ్బులు తీసుకొచ్చే వ‌ర‌కు వెయిట్ చేస్తారా? అలా ఏం అక్క‌ర్లేదు




మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు. ఏటీఎం నుంచి డ‌బ్బులు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు అది ఎలా అని అనుకుంటున్నారా ! ఎస్బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, కొట‌క్ మ‌హీంద్రా స‌హా ఇలా చాలా బ్యాంకులు కార్డు ర‌హితంగా న‌గ‌దు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్నాయి మ‌రి డెబిట్ కార్డు లేకుండా డ‌బ్బులు విత్ డ్రా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం


 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో యోనో యాప్‌లోకి లాగిన్ అయి.. అందులోని యోనో క్యాష్‌పై క్లిక్ చేయాలి ఆ త‌ర్వాత ఏటీఎం ఆప్ష‌న్ ఎంచుకోవాలి అనంత‌రం విత్‌డ్రా చేయాల‌ని అనుకుంటున్న న‌గ‌దు మొత్తాన్ని ఎంట‌ర్ చేయాలి అప్పుడు మీ బ్యాంక్ రిజిస్ట‌ర్డ్ మొబైల్‌కు ఒక ట్రాన్షేష‌న్ నంబ‌ర్ మెసేజ్ వ‌స్తుంది. అప్పుడు ఏటీఎం మెషిన్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి కార్డ్‌లెస్ క్యాష్‌ విత్‌డ్రా ఆప్ష‌న్ ఎంచుకుని ఈ ట్రాన్సేష‌న్ నంబ‌ర్‌, ఏటీఎం పిన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి అప్పుడు ఏటీఎం నుంచి మ‌న‌కు కావాల్సిన క్యాష్ వ‌స్తుంది ఈ ట్రాన్సెష‌న్ నంబ‌ర్ నాలుగు గంట‌ల పాటు ప‌నిచేస్తుంది


ఐసీఐసీఐ బ్యాంక్


iMobile యాప్‌లోకి లాగిన్ అయి స‌ర్వీసెస్ ఆప్ష‌న్‌లోకి వెళ్లాలి అనంత‌రం క్యాష్ విత్ డ్రా ఎట్ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం ఆప్ష‌న్ ఎంచుకోవాలి విత్ డ్రా చేయాల‌ని అనుకుంటున్న న‌గ‌దు మొత్తాన్ని, మ‌న అకౌంట్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి దాంతో పాటు నాలుగు అంకెల తాత్కాలిక పిన్ నంబ‌ర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి అనంత‌రం స‌బ్‌మిట్ చేస్తే రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది అప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం వ‌ద్ద‌కు వెళ్లి కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోవాలి ఆ త‌ర్వాత మ‌న మొబైల్ నంబ‌ర్‌, ఫోన్‌కు వ‌చ్చిన ఓటీపీ ఎంటర్ చేసి డ‌బ్బు విత్ డ్రా చేసుకోవ‌చ్చు


బ్యాంక్ ఆఫ్ బ‌రోడా


ముందుగా బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకు చెందిన‌ M-Connect యాప్‌లో లాగిన్ అవ్వాలి ఆ త‌ర్వాత క్యాష్ ఆన్ మొబైల్ స‌ర్వీసెస్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి అనంత‌రం అకౌంట్ నంబ‌ర్ సెలెక్ట్ చేసుకుని, కావాల్సిన మొత్తాన్ని ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ కొట్టాలి అప్పుడు మ‌న రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఒక ఓటీపీ వ‌స్తుంది. అప్పుడు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఏటీఎంలో క్యాష్ ఆన్ మొబైల్ ఆప్ష‌న్ ఎంచుకుని ఓటీపీ ఎంట‌ర్ చేయాలి. అప్పుడు డ‌బ్బు విత్‌డ్రా అవుతుంది అయితే మ‌న మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీ కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే చెల్లుతుంది కాబ‌ట్టి ఏటీఎం వ‌ద్ద‌కు వెళ్లిన త‌ర్వాత‌నే ఓటీపీ జ‌న‌రేట్ చేసుకోవ‌డం మంచిది.


కొటాక్ మ‌హీంద్రా బ్యాంక్‌


ముందుగా కొటాక్ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ త‌ర్వాత కార్డ్‌లెస్ విత్‌డ్రా క్లిక్ చేసి సెల్ఫ్ విత్‌డ్రా ఎంచుకోవాలి సెండ‌ర్ కోడ్ సెలెక్ట్ చేసుకుని మ‌న వివ‌రాలు స‌రిచూసుకుని క‌న్ఫ‌ర్మ్ చేయాలి అప్పుడు మ‌న రిజిస్ట‌ర్డ్ మొబైల్‌కు ఒక ఓటీపీ వ‌స్తుంది. ఆ త‌ర్వాత కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ ఏటీఎం వ‌ద్ద‌కు వెళ్లి కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా ఆప్ష‌న్ ఎంచుకోవాలి. మ‌న మొబైల్ నంబ‌ర్‌, సెండ‌ర్ కోడ్‌తో పాటు ఫోన్‌కు వ‌చ్చిన ఓటీపీ ఎంట‌ర్ చేయాలి అనంత‌రం మ‌న‌కు కావాల్సిన అమౌంట్ ఎంట‌ర్ చేస్తే డ‌బ్బు విత్‌డ్రా అవుతుంది.


ఆర్బీఎల్ బ్యాంకు


ముందుగా ఆర్బీఎల్ బ్యాంకు కు చెందిన ఎంవో బ్యాంక్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి యాప్‌లోని ఐఎంటీ ఆప్ష‌న్ ఎంచుకుంటే రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ కోడ్‌ను ఆర్బీఎల్ బ్యాంక్ ఏటీఎంలో ఎంట‌ర్ చేసి డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు



హెచ్‌డీఎఫ్‌సీ



హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. అనంత‌రం ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ విభాగంలోని కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా ఆప్ష‌న్ ఎంచుకోవాలి ఆ త‌ర్వాత వివ‌రాలు క‌న్ఫ‌ర్మ్ చేసి మొబైల్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయగానే ఒక ఓటీపీ వ‌స్తుంది ఓటీపీ ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ చేయాలి అప్పుడు రిజిస్ట‌ర్డ్ మొబైల్‌కు మ‌రో ఓటీపీ, తొమ్మిది అంకెల ఆర్డ‌ర్ ఐడీతో ఒక మెసేజ్ వ‌స్తుంది. అనంత‌రం ఏటీఎం వ‌ద్ద‌కు వెళ్లి కార్డ్‌లెస్ క్యాష్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. మొబైల్ నంబ‌ర్‌, ఓటీపీ, ఆర్డ‌ర్ ఐడీతో పాటు అమౌంట్ ఎంట‌ర్ చేస్తే డ‌బ్బులు విత్‌డ్రా అవుతాయి


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.