Friday 30 July 2021

డీఏ జీవో విడుదలకు ఆదేశాలు సీఎం జగన్మోహన్ రెడ్డి

డీఏ జీవో విడుదలకు ఆదేశాలు సీఎం జగన్మోహన్ రెడ్డి

డీఏ జీవో విడుదలకు ఆదేశాలు సీఎం జగన్మోహన్ రెడ్డి జూలై నుంచి ఇవ్వాల్సిన డీఏకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్న ఆర్థిక శాఖ


డీఏ జీవో విడుదలకు ఆదేశాలు సీఎం జగన్మోహన్ రెడ్డి


అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): జూలై నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏకి సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి  సీఎంవో అధికారులను ఆదేశించినట్లు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 




అలాగే, హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగు లకు 30 శాతం ఇంటి అద్దె అలవెన్సు కొనసాగింపు జీవో విడుదలపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. 

ఉద్యోగుల డీఏకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంవో అధికారులను ఆదేశించినట్టు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. జూలై నుంచి ఇవ్వాల్సిన డీఏకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ఇంకా విడుదల చేయలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. 

వీఆర్వో ల సమస్యలు విని, వారి సర్వీస్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, చెప్పినట్టుగానే అసిస్టెంట్గా పదోన్న అవకాశ ఉత్తర్వులిచ్చారన్నారు

ప్రొబేషన్ పరీక్ష లపై సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు సీఎం దృష్టికి తీసు కెళ్లగా, ఈ విషయమై అధికారులతో మాట్లాడతానని సీఎం చెప్పారన్నారు. కాగా, వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకుగాను సీఎం జగన్కు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. 

ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తదిత రుల సీఎంను కలిసి సత్కరించారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.