Wednesday 21 July 2021

త్వరలోనే టీచర్లకూ టీకాలు సమర్థ విధానంతో అత్యధిక మందికి వ్యాక్సిన్ - వైద్యఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం

త్వరలోనే టీచర్లకూ టీకాలు సమర్థ విధానంతో అత్యధిక మందికి వ్యాక్సిన్ - వైద్యఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం

త్వరలోనే టీచర్లకూ టీకాలు సమర్థ విధానంతో అత్యధిక మందికి వ్యాక్సిన్ ఇప్పటివరకు 1.82 కోట్ల డోసులు అందించాం ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు 100% వాక్సిన్ రాష్ట్రంలో లో బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గుముఖం - వైద్యఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్


త్వరలోనే టీచర్లకూ టీకాలు సమర్థ విధానంతో అత్యధిక మందికి వ్యాక్సిన్ - వైద్యఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం


సమర్థ విధానంతో అత్యధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ వేయగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయ్యాక ప్రభుత్వ, ప్రైవేటు ఉపా ధ్యాయులకు కూడా టీకాలు అందిస్తామని అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాల యంలో కొవిడ్-19 నివారణ, వ్యాక్సినేషన్పై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. 




ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కేంద్రం నుంచి ఇప్పటివరకూ 1,80,82,390 టీకా డోసులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటితో కలిపి ఇప్పటివరకు 1,82, 49,851 డోసుల వ్యాక్సినేషన్ అందించామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రం వద్ద 8,65,500 డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సమర్థ నిర్వహణ వల్ల దాదాపు 11 లక్షల డోసులు ఆదా చేయగలిగామని సీఎం వెల్లడించారు. 

ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని చెప్పారు. విదేశాలకు వెళ్లేవారిలో ఇప్పటి వరకూ 31,796 మందికి వ్యాక్సినేషన్ వేశామన్నారు. 

ధర్జేవ్పై సన్నద్ధతతో ఉండాలన్నారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గుముఖం పట్టాయని సీఎం పేర్కొన్నారు. గతవారం 15 కేసులు నమోదయ్యాయని ఇప్పటివరకూ 4,075 కేసులు గుర్తిస్తే.. వాటిలో 863 మంది చికిత్స పొందుతున్నారని సీఎం చెప్పారు.


రాత్రి కర్ఫ్యూ మరోవారం పొడిగింపు


రాష్ట్రంలో రాత్రి 10 నుంచి ఉదయం 6గంటల కర్వ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా చర్డ్ వేవ్ వస్తే తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.


నేటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ పనివేళలు


రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నెల 21 నుంచి సాధారణ పనివేళలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తారు. జిల్లా, మండల, గ్రామస్థాయి ప్రభుత్వ కార్యాలయా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తారు. 

మరోవైపు కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం చైర్ పర్సన్ గా సచివాలయం నుంచి విదులు నిర్వర్తించిన టీటీడీ ఈవో జవహర్రెడ్డి. ఇకపై తిరుమల నుంచే పనిచేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.