Tuesday 6 July 2021

ప్రత్యామ్నాయ విద్య ప్రణాళిక అమలుకు కసరత్తు నేడు సచివాలయాల పరిధిలో సమావేశాలు

ప్రత్యామ్నాయ విద్య ప్రణాళిక అమలుకు కసరత్తు నేడు సచివాలయాల పరిధిలో సమావేశాలు

ప్రత్యామ్నాయ విద్య ప్రణాళిక అమలుకు కసరత్తు నేడు సచివాలయాల పరిధిలో సమావేశాలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ మంగళవారం గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులతో తల్లిదండ్రులతో సమావేశం


ప్రత్యామ్నాయ విద్య ప్రణాళిక అమలుకు కసరత్తు నేడు సచివాలయాల పరిధిలో సమావేశాలు


కొవిడ్‌ దృష్ట్యా ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2021-22) పాఠశాలలను ఎలా సంసిద్ధం చేయాలి? పిల్లలకు విద్యా బోధనా ఎలా నిర్వహించాలి?  ప్రతి సచివాలయం పరిధిలో పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఈ నెల 15 నుంచి ప్రత్యామ్నాయ విద్య ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్య, శిక్షణ పరిశోధన మండలి (ఎస్‌సీఈఆర్టీ) మార్గదర్శకాలు జారీ చేసింది. 




ప్రత్యామ్నాయ బోధనా విధానాలు అంటే రేడియో, దూరదర్శన్‌ ద్వారా ప్రసారమయ్యే పాఠ్యాంశాలను పిల్లలు వినేలా, వాటిని వీక్షించేలా చేయాలి. స్మార్ట్‌ ఫోన్లు లేని వారికి కనీసం రేడియో అయినా ఉంటుంది. ఆ రేడియో ద్వారా పిల్లలు పాఠ్యాంశాలు వినేలా చేయడమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక ఉంటుందని జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

తరగతుల వారీగా వర్క్‌షీట్లు రూపొందించారు. పాఠశాల విద్యాశాఖ జిల్లాలకు పంపగానే వాటిని వాలంటీర్ల ద్వారా విద్యార్థులకు చేర్చాలి. వాటిని పూర్తి చేసిన తర్వాత పిల్లల తల్లిదండ్రులు పాఠశాలల్లో అందజేయాలి. కొవిడ్‌ దృష్ట్యా విద్యార్థులు పాఠశాలకు  రాకూడదు. వారి తల్లిదండ్రులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. రెగ్యులర్‌గా పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు ప్రతివారం వర్క్‌షీట్లపై పరీక్ష నిర్వహిస్తారు. ఆ ఫలితాలను టీచర్స్, వారి తల్లిదండ్రులకు తెలియజేస్తారు. దీనికి సన్నద్ధం కావాలని విద్యా శాఖ జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఆదేశించింది.

జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ మంగళవారం గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులతో సమావేశమవ్వాలి. పాఠశాలలు పునః ప్రారంభించే లోపు ప్రతి సచివాలయం పరిధిలో ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. ఆ వివరాలు ఈ నెల 7వ తేదీలోపు డీఈఓకు పంపాలని ఆదేశించారు. 

పిల్లలను ఇప్పట్లో పాఠశాలలకు రప్పించబోమని, వారికి జూమ్‌ క్లాసుల రూపంలోనే బోధన ఉంటుందని జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాలో 3250 పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలు పునఃప్రారంభం కాకపోయినా ఉపాధ్యాయులను రోజుకు సగం మందిని పిలిపిస్తున్నారు. మంగళవారం మాత్రం ప్రతి టీచర్‌ పాఠశాలలో అందుబాటులో ఉండాలి. వారంతా కలిసి సచివాలయ కార్యదర్శులతో సమావేశమై ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ, ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక అమలుపై చర్చించి నిర్ధిష్టమైన కార్యాచరణ రూపొందించాలి.


వాలంటీర్‌, అంగన్‌వాడీలకు స్థానము


ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక అమలుకు సంబంధించి మంగళవారం నిర్వహించే సమావేశానికి సచివాలయం పరిధిలో ఆయా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాటు వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్లు, అంగన్‌వాడీ టీచర్లు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులను ఆహ్వానించారు.


ప్రణాళికలో ముఖ్యాంశాలివి


 ప్రతి బడిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బృందాలుగా విభజించాలి. ఒక్కో ఉపాధ్యాయ బృందానికి 15 మంది విద్యార్థులకు మించకూడదు. రేడియో, దూర్‌దర్శన్‌లో ప్రసారమయ్యే డిజిటల్‌ కంటెంట్‌ అభ్యసనాలను వీక్షించి, ఆలకించేలా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు బాగా ఉన్న వారిని గుర్తించాలి. ఉపాధ్యాయులు లేని చోట్ల పర్యవేక్షణ బాధ్యతలు వారికి అప్పగించాలి.

బడిబయట పిల్లలను గుర్తించి వారికి బోధన చేయాలి.

వివిధ మాధ్యమాల ద్వారా విద్యకు సంబంధించి వచ్చే డిజిటల్‌ కంటెంట్‌ను ఉపాధ్యాయులు సేకరించి విద్యార్థులకు అందజేయాలి. ఉదాహరణకు దీక్ష కంటెంట్‌ తదితరాలు.

ఆడియో, వీడియోలను స్థానిక కేబుల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా విద్యార్థులకు చేరేలా నెట్‌వర్క్‌ యాజామాన్యాల సహకారం పొందాలి. ఈ బాధ్యతలను ప్రధానోపాధ్యాయులు చూడాలి.

గ్రంథాలయాలను వినియోగించుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.

ఆన్‌లైన్‌ తరగతులకు సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించడానికి స్థానికంగా ఉన్నత విద్య చదివిన వారిని గుర్తించాలి. వారి సహకారంతో ఈ సమస్యను అధిగమించాలి.

కొవిడ్‌ పరిస్థితులపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.

విద్యార్థుల ప్రగతిని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సమీక్షించాలి. విద్యార్థులు ఏం చదివారు, ఏం నేర్చుకున్నారో రికార్డు చేయాలి

అవసరమైతే డిజిటల్‌, వర్చువల్‌ తరగతులను వినియోగించుకోవడానికి పాఠశాలలను సంసిద్ధం చేసుకోవాలి.


Get More GO Information Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.