Friday 16 July 2021

మళ్ళీ పుంజుకుంటున్న కరోనా మూడో వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం - డబ్ల్యూహెచ్‌వో

మళ్ళీ పుంజుకుంటున్న కరోనా మూడో వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం - డబ్ల్యూహెచ్‌వో

మళ్ళీ  పుంజుకుంటున్న కరోనా-డబ్ల్యూహెచ్‌వో ప్రపంచమంతా పెరుగుతున్న కేసులు, మరణాలు  -టెడ్రోస్‌ అధనమ్‌, డైరెక్టర్‌ జనరల్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ


మళ్ళీ పుంజుకుంటున్న కరోనా మూడో వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం - డబ్ల్యూహెచ్‌వో


ఐక్యరాజ్యసమితి, వాషింగ్టన్‌, మెల్‌బోర్న్‌, జూలై 15: తగ్గిందనుకున్న కరోనా ఉధృతి మళ్లీ క్రమంగా ‘విశ్వ’రూపం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా తొమ్మిది వారాలపాటు తగ్గుతూ వచ్చిన కొవిడ్‌ మరణాల సంఖ్యలో మళ్లీ పెరుగుదల నమోదైంది.




ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం అంతకు ముందు వారంతో పోలిస్తే గత వారం మరణాల సంఖ్య 3 శాతం అధికంగా నమోదైంది. కిందటివారం ప్రపంచవ్యాప్తంగా 55 వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే 30 లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే కేసుల సంఖ్య 10 శాతం పెరగడం గమనార్హం. ముఖ్యంగా.. బ్రెజిల్‌, భారత్‌, ఇండోనేషియా, బ్రిటన్‌ దేశాల్లో కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

కరోనా నిబంధనలను పాటించకపోవడం, పలు దేశాల్లో వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగడం, డెల్టా వేరియంట్‌ కరోనా కేసులు, మరణాల పెరుగుదలకు కారణమని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.

ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ ఇప్పటికే 111 దేశాల్లో విస్తరించిందని, ఇది ప్రబల వేరియంట్‌గా మారే ముప్పుందని హెచ్చరించింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ దెబ్బకు అమెరికాలో గత మూడువారాలుగా రోజువారీ కేసుల సంఖ్య రెట్టింపవుతోంది.

జూన్‌ 23న అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య 11,300 కాగా సోమవారం నాటికి(జూలై 12) ఆ సంఖ్య 23,600కి, బుధవారం(జూలై 14) నాటికి 35,447కి చేరింది.  టీకాలు వేయించుకున్నవారి సంఖ్య తక్కువగా ఉన్న మిస్సౌరీ(45.9ు), ఆర్కన్సాస్‌ (43ు), నెవడా(50.9ు), లౌజియానా(39.2ు), యూటా (49.5ు) రాష్ట్రాల్లో గత రెండువారాలుగా కేసుల సంఖ్య భారీగా పెరగడం గమనార్హం.

ఇక అర్జెంటీనాలో కొవిడ్‌ మరణాల సంఖ్య లక్ష దాటింది. రష్యాలోనూ రికార్డుస్థాయిలో రోజువారీ కొవిడ్‌ మరణాలు నమోదవుతున్నాయి. బెల్జియంలో యువతలో కేసులు పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో ఆరునెలల తర్వాత తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య బుధవారం(జూలై 14న) 40 వేలు దాటింది. మయన్మార్‌లో దహనవాటికలు రాత్రింబవళ్లూ పనిచేస్తున్నాయి. 


 మూడో వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం


దురదృష్టవశాత్తూ మనం మూడో వేవ్‌ ప్రారంభ దశలో ఉన్నాం. డెల్టా వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా 111 కు పైగా దేశాల్లో ఉంది త్వరలోనే  అది ప్రబల వేరియంట్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నాము ప్రజల రాకపోకలు పెరగడం, కరోనా నిబంధనలు పాటించకపోవడమే వైరస్‌ వ్యాప్తికి కారణం


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.