DSC 2008 క్వాలిఫైడ్ అభ్యర్థులకు నేడు కౌన్సెలింగ్ నియామక ఉత్తర్వులు | ప్రభుత్వ ఆదేశాల మేరకు 2008 డీఎస్సీ అభ్యర్థులకు సెకెండరీ గ్రేడ్ టీచర్లుగా పోస్టింగ్లు ఇచ్చేందుకు శనివారం కౌన్సెలింగ్ నియామక ఉత్తర్వులు
DSC 2008 క్వాలిఫైడ్ అభ్యర్థులకు నేడు కౌన్సెలింగ్ నియామక ఉత్తర్వులు
డీఎస్సీ 2008లో క్వాలిఫై అయ్యి ఇటీవల నియామకాలకు వీలుగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు శనివారం ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాలు నియామక ఉత్తర్వులివ్వనున్నాయి.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నేడు కౌన్సెలింగ్
ప్రభుత్వ ఆదేశాల మేరకు 2008 డీఎస్సీ అభ్యర్థులకు సెకెండరీ గ్రేడ్ టీచర్లుగా పోస్టింగ్లు ఇచ్చేందుకు శనివారం మచిలీపట్నంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈవో తాహేరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు.
ముందస్తు అంగీకార పత్రాలు సమర్పించి, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన 126 మంది అభ్యర్థులు డీఈఓ కార్యాలయంనకు ఉదయం 10గంటలకు హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
Get Download CSE AP Guidelines Click here
0 comments:
Post a Comment