Sunday 1 August 2021

టెన్త్ ఫలితాలపై నివేదిక రెడీ స్లిప్ టెస్టులకు 70, ఎఫ్ఎకు 30% ఖరారు

టెన్త్ ఫలితాలపై నివేదిక రెడీ స్లిప్ టెస్టులకు 70, ఎఫ్ఎకు 30% ఖరారు

టెన్త్ ఫలితాలపై నివేదిక రెడీ పై చదువులకు ఇబ్బందుల్లేని రీతిలో నిర్ణయాలు స్లిప్ టెస్టులకు  70, ఎఫ్ఎకు 30% ఖరారు? రేపు స్పష్టత వచ్చే అవకాశం రెండో వారం నుంచి పాఠశాలలు అమ్మఒడి వద్దంటే ల్యాప్టాప్లు ఎన్ఈపీ అమలులో 3 వేల స్కూళ్లు విలీనం


టెన్త్ ఫలితాలపై నివేదిక రెడీ స్లిప్ టెస్టులకు 70, ఎఫ్ఎకు 30% ఖరారు


పదో తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై సోమవారం ఒక స్పష్టత రానుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరాల ఫలితాలను విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 
ఆగస్టు 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తెరవబోతున్న నేపథ్యంలో పది ఫలితాలను వీలైనంత త్వరగా ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

ఇప్పటికే పదో తరగతి ఫలితాలపై ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ చాయారతన్ కమిటీ ఒక నివేదికను రూపొందించిఅందజేసింది. పదో తరగతి అర్హతతో దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలు, పై చదువులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా నివేదికను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. 

విద్యా సంవత్సరం మొత్తంలో నిర్వహించిన స్లిప్ టెస్టులు, ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల ఆధారంగా మార్కులు కేటాయింపు ఉండనుంది.


పరీక్షల రద్దుతో ప్రత్యేక పరిశీలన.


కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా రాష్ట్రంలో విద్యా సంవత్సరాన్ని ముందుగానే ముగించడంతో పాటు, టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది కూడా పది పరీక్షలను రద్దు చేసినప్పటికీ మార్కులు లేకుండా అందరినీ పాస్ చేయడంతో పలు సమస్యలు తలెత్తాయి. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, రైల్వే, ఆర్మీ వంటి వాటిలో పదో తరగతి అర్హతతో పలు ఉద్యోగాల భర్తీ ఏటా జరుగుతుంటుంది. వాటికి పరీక్షలు నిర్వహించినప్పటికీ పది మార్కులను పరిగణన లోకి తీసుకుంటారు. అలాగే జవహర్ నవోదయ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం పదో తరగతిలో మెరిట్ను ప్రాతిపదికగా ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో గతేడాది ఎదురైన ఇబ్బందులు ఈసారి లేకుండా చూసేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీ విద్యాసంవత్సరంలో నిర్వహించిన స్లిప్ టెస్టులన్నింటికీ కలిపి 70 శాతం, ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఎ)లకు 30 శాతంతో మార్కులు, వాటి ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ధారించినట్లు సమాచారం. అయితే కరోనా వల్ల పరీక్షలు రద్దు చేయటంతో విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లేనని స్పష్టం చేస్తున్నారు. దీనిపై సోమవారం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. తద్వారా ఎదురు చూస్తున్న 6.28 లక్షల మంది విద్యార్థులపై భారం తీరిపోనుంది.


ఎన్ఎస్ఈపీ అమలుకు వడివడిగా


రాష్ట్రంలో నూతన జాతీయ విద్యావిధానం- 2020నిఅమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరు రకాల పాఠశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు దీంతో ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. తొలుత హైస్కూలుకు కిలోమీటరు పరిధిలో ఎన్న పాఠశాలలను హైస్కూల్లోనే విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇలా చేస్తే సుమారు 10 వేల వరకు పాఠశాలల్ని విలీనం చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం పావు కిలోమీటరులోపు ఉన్న పాఠశాలలనే తొలి విడతలో విలీనం చేయాలని నిర్ణయించింది. 

ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల పాఠశాలలు విలీనం కానున్నాయి. ఆగస్టు 16 నాటికి అంటే విద్యాసంస్థలు తెరుచుకునే నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం. విద్యాశాఖ కసరత్తు చేస్తున్నాయి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.