క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం కంట్రిబ్యూటరీ పింఛను పథకం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలపైనా చర్చ ఉద్యోగుల బదిలీ విధానంపైనా చర్చ
క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం కంట్రిబ్యూటరీ పింఛను , కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలపైనా చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పీఆర్సీ అమలు కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపై శుక్రవారం ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభించింది.
ఉద్యోగుల కీలక డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. పీఆర్సీ, కంట్రిబ్యూటరీ పింఛను పథకం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలతో పాటు ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన విధానంపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చిస్తున్నారు.
విజయవాడలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమాశానికి సంబంధిత అధికారులందరూ హాజరయ్యారు.
పీఆర్సీపై ఆగస్టు నెలలోనే కొలిక్కి తీసుకువద్దామని ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలకు ఈ మధ్య చూచాయగా చెప్పారు.
ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డిని ఉద్యోగ సంఘం నేతలు కలిసిన సందర్భంలోనూ ఈ నెలలోనే పీఆర్సీ అమలు దిశగా అడుగులు వేయబోతున్నట్లు చెప్పారు.
మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పీఆర్సీ ఖరారు కావడంతో ఏపీ ఉద్యోగులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ఇప్పటికే కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేశారు.
పీఆర్సీ నివేదికపై అధ్యయనం చేయాలని ఏప్రిల్ 1 న ఆ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆదిత్యనాథ్ సెప్టెంబరు నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
వాస్తవానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జులైలోనే ప్రక్రియ ప్రారంభిద్దామని ఉద్యోగ సంఘాలకు చెప్పినా అప్పడు అడుగు ముందుకు పడలేదు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.