Monday 23 August 2021

ఐటీ పోర్టల్‌ రెడీ : ఇన్ఫోసిస్‌

ఐటీ పోర్టల్‌ రెడీ : ఇన్ఫోసిస్‌

ఐటీ పోర్టల్‌ రెడీ : ఇన్ఫోసిస్‌ సాంకేతిక కారణాల వల్ల పని చేయకుండా పోయిన కొత్త ఐటీ పోర్టల్‌ www.incometax.gov.in ఇప్పుడు రిటర్న్‌ల ఫైలింగ్‌కు రెడీగా ఉన్నదని దాన్ని డెవలప్‌ చేసిన ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటన


ఐటీ పోర్టల్‌ రెడీ : ఇన్ఫోసిస్‌


న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు సాంకేతిక కారణాల వల్ల పని చేయకుండా పోయిన కొత్త ఐటీ పోర్టల్‌ www.incometax.gov.in ఇప్పుడు రిటర్న్‌ల ఫైలింగ్‌కు రెడీగా ఉన్నదని దాన్ని డెవలప్‌ చేసిన ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 




వాస్తవానికి ఈ పోర్టల్‌ ప్రారంభం అయిన జూన్‌ ఏడో తేదీ నుంచే సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా రెండు రోజుల పాటు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. పోర్టల్‌లోని కొన్ని విభాగాలు పని చేయడంలేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇన్ఫోసిస్‌ ఒక ట్విట్టర్‌ సందేశంలో శనివారం నుంచి నిర్వహణాపరమైన కారణాల వల్ల పోర్టల్‌ అందుబాటులో లేకుండా పోయిందని తెలిపింది. అత్యవసర మెయింటెనెన్స్‌ పూర్తి కావడంతో పోర్టల్‌ తిరిగి అందుబాటులో ఉన్నట్టు ఇన్ఫోసిస్‌ ఆదివారం సాయంత్రం మరో ట్వీట్‌ చేసింది.


ఇన్ఫోసిస్‌ సీఈఓ పరేఖ్‌కు ఆర్థిక శాఖ సమన్లు


ఇదిలా ఉండగా కొత్త ఐటీ పోర్టల్‌ ప్రారంభించి రెండు నెలలైనప్పటికీ ఇంకా ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయో  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సోమవారం నాడు సవివరంగా తెలియచేయాలని సూచిస్తూ ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈఓ సలీల్‌ పరేఖ్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ అంతకుముందే సమన్లు జారీ చేసింది. పన్ను రిటర్న్‌ల ఇ ఫైలింగ్‌ కోసం ఈ పోర్టల్‌ను ఇన్ఫోసిస్‌ రూపొందించింది. 

ప్రారంభం నుంచి ఈ పోర్టల్‌ ఏదో ఒక సాంకేతిక అవరోధం ఎదుర్కొంటూ ఉండడంతో ఐటీ రిటర్న్‌లు మాన్యువల్‌గా దాఖలు చేయడానికి ఐటీ శాఖ తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.