Tuesday 10 August 2021

పదవ తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్ధులకు మైగ్రేషన్ సర్టిఫికెట్స్ పాఠశాల లాగిన్ లో పొందవచ్చు

పదవ తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్ధులకు మైగ్రేషన్ సర్టిఫికెట్స్ పాఠశాల లాగిన్ లో పొందవచ్చు

పదవ తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్ధులకు  మైగ్రేషన్ సర్టిఫికెట్స్ పాఠశాల లాగిన్ లో పొందవచ్చు | ఉన్నత విద్యను అభ్యసించడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే పదవ తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్ధులకు  మైగ్రేషన్ సర్టిఫికెట్స్ పాఠశాల లాగిన్ లో పొందవచ్చు అని పత్రికా ప్రకటన  ఆర్.సి. నెం.36/J-1/2021 తేదీ: 10-08-2021 విడుదల చేసిన ప్రభుత్వ పరీక్షల కార్యాలయం


పదవ తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్ధులకు మైగ్రేషన్ సర్టిఫికెట్స్ పాఠశాల లాగిన్ లో పొందవచ్చు


ఆంధ్ర ప్రదేశ్ లో 2020-21 విద్యా సంవత్సరానికి సంభందించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు 06-08-2021 తేదీన విడుదల చేయడమైనది. ఉన్నత విద్యను అభ్యసించడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే పదవ తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్ధుల సౌలభ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని పరీక్ష రుసుముతో పాటు Rs.80/- చెల్లించిన వారికి మైగ్రేషన్ సర్టిఫికెట్ సంభందిత పాఠశాల లాగిన్ లో పొందుపరచడం జరిగినది. 




ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్ కలర్ కాపీని సంభందిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేయవలెను. ఈ అవకాశం 05-09-2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత మైగ్రేషన్ సర్టిఫికెట్ పొందగోరు విద్యార్ధులు మరలా Rs.80/- రుసుము చెల్లించి ఆన్లైన్ లో ప్రభుత్వ పరీక్షల సంచాలకులవారి కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని మైగ్రేషన్ సర్టిఫికెట్ పొందగలరు.

2021 మాత్రమే కాకుండా పూర్వపు సంవత్సరాలలో పదవ తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్ధులు కూడా ఈ సంవత్సరం నుండి మైగ్రేషన్ సర్టిఫికెట్ కొరకు ఆన్లైన్ లో ప్రభుత్వ పరీక్షల సంచాలకులవారి కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించడం జరుగుతుంది. 

విద్యార్ధి దరఖాస్తు తేది నుండి 30 రోజుల వరకు మాత్రమే వెబ్ సైట్ నందు మైగ్రేషన్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంటుంది. 

దరఖాస్తు చేసుకొనుటకు తగిన సూచనలు మరియు విధి విధానాలు త్వరలో ఒక వీడియో మరియు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) ద్వారా www.bse.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచడం జరుగుతుంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.