Monday 2 August 2021

టీకా తీసుకున్నా డెల్టా వేరియంట్ పంజా

టీకా తీసుకున్నా డెల్టా వేరియంట్ పంజా డోసులతో సంబంధం లేదు ప్రతీ ఒక్కరిపై తీవ్ర ప్రభావం సీడీసీ నివేదిక లో వెల్లడి

టీకా తీసుకున్నా డెల్టా వేరియంట్ పంజా డోసులతో సంబంధం లేదు ప్రతీ ఒక్కరిపై తీవ్ర ప్రభావం సీడీసీ నివేదిక లో వెల్లడి ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్క్ పెట్టుకుని సామాజిక దూరం పాటించాల్సిందే అంటూ సూచించింది


టీకా తీసుకున్నా డెల్టా వేరియంట్ పంజా


 న్యూఢిల్లీ: కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి రెండు దోసుల వ్యాక్సిన్ తీసుకున్నాం ఇక ఎలాంటి భయం లేదని భావించే వారికి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోట్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఓ హెచ్చరిక జారీ చేసింది. డెల్టా వేరియంట్ దేనికీ అతీతం కాదని తెలిపింది. 




రెండు డోసులు వేసుకున్నా డెల్టా వేరియంట్ వారినపడే అవకాశాలు అంతే ఉంటాయని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న ధీమాలో ఉండొద్దని, ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్క్ పెట్టుకుని సామాజిక దూరం పాటించాల్సిందే అంటూ సూచించింది. 

థర్డ్ వేవ్ ముప్పునకు డెల్టా వేరియంట్ కారణం అవుతుందని తెలిపింది. డెల్టా వైరస్ ప్రభావం ప్రతీ ఒక్కరిపై ఉంటుందని స్పష్టం చేసింది. డెల్టా వైరస్ ముందు వ్యాక్సిన్ తీసుకున్న వారు తీసుకోని వారు సమానం అని చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితం కాకుండా ఉండేందుకు చావు నుంచి తప్పించేందుకు టీకాలు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి. 

టీకా వేసుకున్న వ్యక్తులు అంటు వ్యాధుల బారిన పడటం చాలా తక్కువ అనిసీడీసీ తెలిపింది. అమెరికాలోని మసాచుసెట్స్ ప్రావిన్స్ టౌన్లో భారీగా కేసులు నమోదయ్యాయి. వీరంతా రెండు దోసుల టీకాలు తీసుకున్నవారు. ఈ నెలలో ఒక మసాచుసెట్స్ లోనే 470 కేసులు రికార్డయ్యాయి. కరోనా బారినపడి మూడు వంతుల మంది టీకా తీసుకున్నవారే ఉండటం గమనార్హం. జెన్యూపరంగా విశ్లేషించబడిన చాలా నమూనాల్లో డెల్టా వేరియంట్ను గుర్తించారు.

టీకా తీసుకున్న వారితో పాటు తీసుకోని వారిలో కూడా వైరస్ లోడ్ అధికంగా ఉందని సీడీసీ తెలిపింది. అధిక వైరస్ లోడ్ ప్రమాదాన్ని సూచిస్తోందని, ఇతర వేరియంట్లల మాదిరి కాకుండా డెల్టా బారినపడిన వ్యక్తులు వైరస్ సూపర్ స్పైడర్లుగా ఉంటారని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోచెల్లి వాలెన్స్కీ, తెలిపారు. 

టీకా తీసుకున్న వారికంటే తీసుకోని వారే త్వరగా డెల్టా వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నాయన్నారు. నివేదికతో  వైరస్ తన రూపు రేఖలు మార్చుకుంటున్న తరుణం లో టీకాలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. డెల్టా వేరియంటిపై ప్రపంచ వ్యాప్తం గా నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. సాధారణ వైరస్ కు అనుగుణంగా ఇప్పటి వరకు అన్ని ఫార్మా కంపెనీలు టీకాలను తయారు చేశాయి. అయితే ఆ టీకాను తట్టుకుని కూడా వ్యాధి వ్యాప్తి చెందే లక్షణం డెల్టా వైరస్కు ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, జపాన్, చైనాతో పాటు పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులకు డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని చెబుతున్నారు

ఒరిజినల్ వైరస్ కంటే డెల్టా వైరస్ ఎంత ప్రమాదకర మో ఎంత తేడానో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నారు. అమెరికా వ్యాప్తంగా కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చేరుతున్న వారిలో 97 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారే అని అధ్యయనాలు చెబుతున్నాయి. 12 ఏళ్లు ఆపైబడిన 58 శాతం నుంచి వ్యాక్సిన్ తీసుకున్నారు. రోజుకు లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత జోరందుకుంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.