Saturday 7 August 2021

మంత్రివర్గ సమావేశం నిర్ణయాల్లో ముఖ్యాంశాలు ఈ ఏడాది విద్యాకానుకకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

మంత్రివర్గ సమావేశం నిర్ణయాల్లో ముఖ్యాంశాలు ఈ ఏడాది విద్యాకానుకకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

మంత్రివర్గ సమావేశం నిర్ణయాల్లో ముఖ్యాంశాలు ఈ ఏడాది విద్యాకానుకకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ విద్యాకానుక, మనబడి నాడు – నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల, జిల్లా పరిషత్‌ స్కూళ్లు, మున్సిపల్, ట్రైబల్‌ వెల్ఫేర్ స్కూళ్లను సంస్కరణల్లో భాగంగా ఆరు రకాలుగా వర్గీకరించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం


మంత్రివర్గ సమావేశం నిర్ణయాల్లో ముఖ్యాంశాలు ఈ ఏడాది విద్యాకానుకకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్


సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వివరాలను రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో మీడియాకు వివరించారు.




విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కేబినెట్‌ ఆమోదం అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్‌ సంస్కరణలకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ గవర్నమెంటు స్కూళ్లలో చదివే పిల్లల్లో అభ్యాసనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు పలు కీలక నిర్ణయాలు భవిష్యత్తులో ప్రపంచ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక నిర్ణయాలు దోహదపడతాయన్న మంత్రివర్గం విద్యార్ధుల్లో నైపుణ్యాలపై వివిధ సర్వేల ఫలితాలను మంత్రివర్గం ముందుంచిన అధికారులు విద్యాకానుక, మనబడి నాడు – నేడు చర్యలు ఈ దిశగా నడిపిస్తున్నాయంటున్న మంత్రివర్గం మనబడి నాడు నేడు ద్వారా విద్యాసంస్థల దశ, దిశ మారుతోందన్న మంత్రివర్గం తొలివిడత నాడు – నేడుకోసం రూ.3,669 కోట్లను ఇప్పటికే ఖర్చుచేసిన ప్రభుత్వం.మొత్తంగా ఈ పనులకోసం రూ.16,021.67 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ సెంటర్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల, జిల్లా పరిషత్‌ స్కూళ్లు, మున్సిపల్, ట్రైబల్‌ వెల్ఫేర్ స్కూళ్లను సంస్కరణల్లో భాగంగా ఆరు రకాలుగా వర్గీకరించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం


ఈ ఏడాది విద్యాకానుకకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్‌


1. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2)

2. ఫౌండేషనల్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు)

3. ఫౌండేషనల్‌ ప్లస్‌ స్కూల్స్‌  (పీపీ–1 నుంచి 5వ తరగతి వరకూ)

4. ప్రి హైస్కూల్స్‌  ( 3వ తరగతి నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)

5. హైస్కూళ్లు  ( 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ )

6. హైస్కూల్‌ ప్లస్‌స్కూళ్లు   ( 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ)


2021–22 సంవత్సరానికి వైయస్సార్‌ నేతన్న నేస్తం అమలుకు కేబినెట్‌ ఆమోదం ఆగస్టు 10న నేతన్న నేస్తం అమలు సొంత మగ్గంమీద నేసే కార్మికుడి కుటుంబానికి రూ.24వేల చొప్పున ఆర్థిక సహాయం బడ్జెట్‌లో రూ.199 కోట్లు కేటాయింపు

అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం రూ. 20వేల లోపు డిపాజిట్‌దారులకు ఆగస్టు 24న పరిహారం పంపిణీ ఆగస్టు 5వరకూ అందిన వివరాల ప్రకారం సుమారు 4 లక్షల మంది డిపాజిట్‌దారులకు సుమారు రూ. 511 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం రూ.10వేల లోపు డిపాజిట్‌ దారులైన 3.4 లక్షలమందికి ఇదివరకే రూ.238.7 కోట్లు పంపిణీచేసిన ప్రభుత్వం ఈనెల 24న పంపిణీ చేయనున్న ప్రభుత్వం

పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌కోసం ఉద్దేశించిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం జగనన్న స్వచ్ఛసంకల్పం కింద అర్భన్, రూరల్‌  ప్రాంతాల్లో 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు ఇంటింటికీ చెత్త సేకరణ విధానం పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ

అక్టోబరు 15, 2019 నాటివరకూ ఉన్న వాటికి క్రమబద్ధీకరణ మాస్టర్‌ ప్లాన్, జోనల్‌డెవలప్‌ మెంట్, రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లో ప్రభావితమైన భూములకు వర్తించదు అప్రూవ్డ్‌ లే అవుట్స్‌ నిర్మాణాలకు వర్తించదు

1977 నాటి ఏపీ అసైన్డ్‌, భూముల చట్టం (పీఓటీ)లో చట్ట సవరణలకు కేబినెట్‌ ఆమోదం పెద్ద ఎత్తున ప్రజలనుంచి వస్తున్న అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం సెక్షన్‌ 3(2ఏ), సెక్షన్‌ 3 ( 2బీ)సవరణకు కేబినెట్‌ ఆమోదం అసైన్డ్‌ భూమి లేదా, అసైన్డ్‌ ఇంటి విక్రయానికి ఇప్పుడున్న గడువును 20 ఏళ్లనుంచి 10 ఏళ్లకు తగ్గిస్తూ నిర్ణయం సవరించిన చట్టం అమల్లోకి వచ్చేనాటికి అసైన్డ్‌భూమి, అసైన్డ్‌ ఇంటిని ఎవరికైనా విక్రయిస్తే వాటికి ఆమోదం అలాగే చట్టం అమల్లోకి వచ్చేనాటికి ఇలా చేయాలనుకుంటే నిర్దేశించుకున్న విధానం ప్రకారం నిర్దేశించిన ఫీజులను అనుసరించి విక్రయానికి అనుమతులు ఇవ్వాలని నిర్ణయం

అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో నిర్మిస్తున్న పలు భవనాలకు ప్రభుత్వ స్థలాల కొరత నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రైవేటు భూమిని నిర్మాణాలకు తీసుకుని దానికి బదులు మరోచోట ప్రభుత్వ భూమిని ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం వివిధ జిల్లాల కలెక్టర్లనుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రాధాన్యతా కార్యక్రమాల కింద పెద్ద ఎత్తున గ్రామాల్లో భవనాల నిర్మాణం గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ లైబ్రరీలు, అంగన్‌వాడీ సెంటర్లు, సీడ్‌ గ్రోయింగ్‌ సెంటర్లు, మల్టీ ఫెసిలిటీ సెంటర్లు, 90 రోజుల్లోగా ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాలు నిర్దేశిత సమయంలోగా వీటి నిర్మాణాలు పూర్తయ్యేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్న మంత్రివర్గం

మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం ఉద్దేశించిన రివైజ్డ్‌ డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదం రూ.5,155.73  కోట్లతో పోర్టు నిర్మాణం 36 నెలల్లో పోర్టు నిర్మాణం చేయాలని లక్ష్యం

శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు రివైజ్డ్‌ డీపీఆర్‌కు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఫేజ్‌–1 లో భాగంగా రూ. 4361.9 కోట్లతో పోర్టు నిర్మాణం, పోర్టుకోసం భూసేకరణ 30 నెలల్లో పోర్టును నిర్మించాలని లక్ష్యం

ఏపీజీడీసీలో ప్రభుత్వ సంస్థలైన ఏపీఐఐసీ, ఏపీఎంబీల వాటాలు గణనీయంగా పెంపునకు కేబినెట్‌ ఆమోదం 50శాతం నుంచి 74శాతానికి పెంపు

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు కేబినెట్‌ ఆమోదం శ్రీకాకుళం జిల్లా బుడగట్ల పాలెం,  విశాఖజిల్లా పూడిమడక ప్రకాశం జిల్లా కొత్తపట్నం పశ్చిమగోదావరి జిల్లా బియ్యపు తిప్పల్లో షిఫింగ్‌ హార్బర్ల నిర్మాణం రూ.1720.61 కోట్లతో వీటి నిర్మాణం డీపీఆర్‌లకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఫేజ్‌ –2 కింద ఈ నాలుగు నిర్మాణాలు నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పీపీపీ పద్ధతిలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించిన టెక్నో ఎకనామిక్‌ ఫీజబిలిటీ స్టడీ రిపోర్టుకు కేబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ ఛారిటబుల్‌ మరియు హిందూ రెలిజియస్‌ ఇనిస్టిట్యూషన్స్‌ మరియు ఎండో మెంట్‌ యాక్ట్, 1987లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌జారీకి మంత్రివర్గం ఆమోదం టీటీడీ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల అభివృద్ది, అర్చకుల సంక్షేమంకోసం ఆర్డినెన్స్‌ ద్వారా పలు చర్యలు

ధార్మిక పరిషత్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం ఈమేరకు చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీచేయనున్న ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10లక్షల ప్యాకేజీకి కేబినెట్‌ఆమోదం దాదాపు రూ.550 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం గతంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు.

రవాణాశాఖలో ఒక మోటారు వెహికల్‌ ఇనస్పెక్టర్, సీనియర్‌ లేదా జూనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు హోంగార్డు పోస్టులకు మంత్రివర్గం ఆమోదంvచిత్తూరుజిల్లా పుంగనూరులో ఈ పోస్టులు మంజూరు.

ఈనెల 13న నిర్వహించనున్న వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులకు మంత్రివర్గం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాల దృష్ట్యా హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని మంత్రివర్గం నిర్ణయం హైకోర్టు అభిప్రాయాల నేపథ్యంలోనే రాష్ట్ర మావనహక్కుల సంఘం కార్యాలయాన్నికూడా కర్నూలుకు తరలించాలని నిర్ణయం

రాష్ట్ర మానవహక్కుల సంఘం కార్యాలయంలో ఒక సెక్రటరీ, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ – జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, పీఆర్వో .. ఈ ఐదుపోస్టులకూ కేబినెట్‌ ఆమోదం.

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తలో కూడా రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, డైరెక్టర్‌– ఇన్వెస్టిగేషన్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌– జ్యుడిషియల్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ – అక్కౌంట్స్, లోకాయుక్త, ఉపలోకాయుక్త, రిజిస్ట్రార్లకు పీఏలు, అక్కౌంట్స్‌ఆఫీసర్, లైబ్రేరియన్, మోటార్‌సైకిల్‌ మెసెంజర్‌ ఈ పోస్టులకు కేబినెట్‌ ఆమోదం.

గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్‌ పోస్టు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం

రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌ బొవైనీ బ్రీడింగ్‌ ఆర్డినెన్స్‌ 2021కి కేబినెట్‌ ఆమోదం

రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడానికి ఉద్దేశించిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం రాష్ట్ర ఉత్పత్తిలో 30శాతం వరకూ స్థానికంగానే వినియోగం కోసం చర్యలు తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయనున్న ప్రభుత్వం ప్రీ ప్రాససింగ్‌యూనిట్లు, ప్రాససింగ్‌ ప్లాంట్లు, ఆక్వాహబ్‌లను, వీటికి అనుబంధంగా రిటైల్‌దుకాణాలను ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం

పశు సంవర్థకశాఖలో 19 ల్యాబ్‌ టెక్నిషియన్, 8 ల్యాబ్‌ అటెండెట్లు  పోస్టుల మంజూరుకు ఆమోదం

కాంట్రాక్టు పద్ధతిలో టెక్నిషియన్లు, అవుట్‌సోర్సింగ్‌ విధానంలో అటెండెంట్ల నియామకం

రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి చట్టసవరణకు కేబినెట్‌ఆమోదం ఉద్యానవన పంటల సాగులో వచ్చిన అత్యున్నత విధానాలు, పరిజ్ఞానం నేపథ్యంలో నర్సరీలు, వాటినుంచి వచ్చే మొక్కలు తదితర అంశాల్లో ప్రమాణాలను పాటించేలా చేసేందుకు తగిన చర్యల్లో భాగంగా చట్టసవరణ.

రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు, పంటల పరిస్థితులపై కేబినెట్‌కు వివరాలు అందించిన అధికారులు

ఇప్పటివరకూ 42.27 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్టుగా వివరించిన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైందని, 8.3శాతం సగటును అధిక వర్షపాతం ఉందని తెలిపిన అధికారులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందని తెలిపిన అధికారులు కడపలో 70.2శాతం, అనంతపురంలో 65.6, కర్నూలులో 25.5, చిత్తూరులో 58.6శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యిందన్న అధికారులు

అగ్రికల్చర్‌ అడ్వైజరీ సమావేశాలు, పంటల ప్రణాళికపైనా కేబినెట్‌కు వివరణ

రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలను కేబినెట్‌కు వివరించిన వైద్యారోగ్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్‌ పరిస్థితులనూ వివరించిన అధికారులు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.