Sunday 30 January 2022

పదవీ విరమణ వయసును 60 నుంచి 62ఏళ్లకు పొడిగించిన ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది రేపు ఆమోదించనున్న గవర్నర్‌ హరిచందన్‌?

పదవీ విరమణ వయసును 60 నుంచి 62ఏళ్లకు పొడిగించిన ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది రేపు ఆమోదించనున్న గవర్నర్‌ హరిచందన్‌?

పదవీ విరమణ వయసును 60నుంచి 62ఏళ్లకు పొడిగించిన ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది రేపు ఆమోదించనున్న గవర్నర్‌ హరిచందన్‌? 

పదవీ విరమణ వయసును 60 నుంచి 62ఏళ్లకు పొడిగించిన ముసాయిదా రాజ్‌భవన్‌కు చేరింది రేపు ఆమోదించనున్న గవర్నర్‌ హరిచందన్‌? 

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60నుంచి 62ఏళ్లకు పొడిగించిన ప్రభుత్వం దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న జరిగిన కేబినెట్‌లో ఆమోదించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను న్యాయశాఖ పరిశీలన అనంతరం గవర్నర్‌ ఆమోదానికి పంపించింది. 

ఆ ముసాయిదా  శనివారం రాజ్‌భవన్‌కు చేరింది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దాన్ని మరోసారి పరిశీలించి ఆమోదం తెలపగానే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేస్తుంది. 

ఈ ముసాయిదాను గవర్నర్‌ సోమవారం ఆమోదించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంది. 

2014 జూన్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లుపెట్టి సభ ఆమోదించి రిటైర్మెంట్‌ వయసును 58నుంచి 60 ఏళ్లకు పొడిగించింది. 

అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏపీ పబ్లిక్‌ ఎప్లాయింట్‌మెంట్‌ యాక్ట్‌ 1984కు సవరణ చేయాల్సి ఉంటుంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.