Monday 31 January 2022

పదవీ విరమణ వయస్సు (62 సం లకు ) పెంచుతూ ఉత్తర్వులు (ఆర్డినెన్సు) జారీ చేసిన ప్రభుత్వం

పదవీ విరమణ వయస్సు (62 సం లకు ) పెంచుతూ ఉత్తర్వులు (ఆర్డినెన్సు) జారీ చేసిన ప్రభుత్వం

పదవీ విరమణ వయస్సు (62 సం లకు ) పెంచుతూ ఉత్తర్వులు (ఆర్డినెన్సు) జారీ చేసిన ప్రభుత్వం Retirement Age Ordinance ANDHRA PRADESH ACTS, ORDINANCES AND REGULATIONS Etc


పదవీ విరమణ వయస్సు (62 సం లకు ) పెంచుతూ ఉత్తర్వులు (ఆర్డినెన్సు) జారీ చేసిన ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ చట్టములు, అధ్యాదేశములు మరియు నియమములు మొదలగునవి 20 జనవరి 30వ తేదీన గవర్నరు జారీ చేసిన ఈ క్రింది ఆధ్యాదేశపు ఇంగ్లీషు భాషలోని అధికార పాఠమును భారత సంవిధానము యొక్క 348(3) అనుచ్ఛేదము క్రింద అందరి ఎరుక నిమిత్తము ప్రచురించబడుచున్నది. 2022లోని 1వ ఆంధ్రప్రదేశ్ అధ్యాదేశము




భారత ప్రజారాజ్యపు డెబ్భై మూడవ సంవత్సరములో గవర్నరుచే జారీ చేయబడినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల (పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ) చట్టము, 1984ను ఇంకనూ సవరించుటకైన అధ్యాదేశము.

అంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ) చట్టము, 1984 ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 55 సంవత్సరములుగా విహితపరచినందుననూ మరియు ఆఖరు గ్రేడు సర్వీసు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరములుగా నిర్ణయించినందుననూ,

మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల (పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ) (సవరణ) చట్టము, 2014 (2014లోని 4వ చట్టము) ద్వారా 02-06-2014 నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మొదలగు వారికి పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరముల నుండి 60 సంవత్సరములకు పెంచుతూ 2014వ సంవత్సరములో ప్రధాన చట్టమును ఇంకనూ సవరించినందునమా,

మరియు 2014లో ఉన్న జీవిత కాలముతో పోల్చినపుడు సగటు జీవిత కాలములో చెప్పుకొనదగిన మెరుగుదల ఉన్నందుననూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2019లో ప్రాపంచిక సగటు జీవిత కాలము దాదాపు 73 సంవత్సరములుగాను మరియు భారతీయ సగటు జీవిత కాలము 70 సంవత్సరములుగాను ఉన్నందున మరియు సాధారణ ఆరోగ్య పరిస్థితులు మెరుగైనందుననూ;

మరియు, సీనియర్ ఉద్యోగుల అనుభవము మరియు నైపుణ్యాన్ని వినియోగించుకొనుటకుగాను మరియు పెరిగిన జీవిత కాలమును, మెరుగువడిన సాధారణ ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోనికి తీసుకొనుచూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల (పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ) చట్టము, 1984 క్రిందకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి ప్రస్తుత పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరముల నుండి 62 సంవత్సరములకు పెంచవలెనని మరియు సదరు నిర్ణయమును 01-01-2022 నుండి అమలు చేయుటకు ప్రతిపాదించవలెనని పర్యాలోచించడమైనది. పై ప్రతిపాదనను అమలుపరచుటకు గాను ఈ అధ్యాదేశమును జారీచేయుట అవసరమైయున్నది;

మరియు, అధ్యాదేశములోని 2వ పరిచ్ఛేదము పై నిర్ణయాన్ని అమలుచేయాలని

మరియు 30-03-2021 నుండి అమలులోకి వచ్చిన 2021లోని 3వ చట్టము

ద్వారా తెలంగాణా రాష్ట్రం 1984 చట్టములో (తెలంగాణాకు వర్తింపు) ఖండము 3ఏ (2)ను సవరించిన పర్యవసానంగా, అధ్యాదేశములోని 3వ పరిచ్ఛేదము ఆవశ్యకమై ఉన్నందుననూ; మరియు, చట్టానికి అవసరమైన సవరణలు తక్షణమే వర్తింపులోకి రానట్లయితే, ప్రభుత్వ ఉద్యోగుల పదవీకాలం మరియు ఉద్యోగ విరమణ తేదీలు ప్రభావితమవుతాయనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తావనలోని విషయాంశముపై తక్షణ చర్య తీసుకోవలసిన అవసరమున్నది. గడచిన ఇటీవల కాలంలో కోవిడ్ ఆకస్మికంగా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మరియు రాష్ట్ర శాసనమండలి సమావేశములో లేనందుననూ, పైన తెలిపిన పరిస్థితులపై తక్షణ చర్య తీసుకోవలసిన అవసరమున్నందుననూ; మరియు రాష్ట్ర శాసనమండలి ఇప్పుడు సమావేశములో లేనందుననూ మరియు వెంటనే

చర్య తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడినవని ఆంధ్రప్రదేశ్ గవర్నరు అభిప్రాయపడినందుననూ, భారత సంవిధానములోని 213వ అనుచ్ఛేదపు ఖండము (1) ద్వారా ఒసగబడిన అధికారములను వినియోగిస్తూ, గవర్నరు ఇప్పుడు, ఇందుమూలంగా ఈ క్రింది అధ్యాదేశమును జారీచేయుచున్నారు:

ఈ అధ్యాదేశమును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల (పదవీ విరమణ వయస్సు

సంగ్రహము మరియు ప్రారంభము. క్రమబద్ధీకరణ) (సవరణ) అధ్యాదేశము, 2022 అని పేర్కొనవచ్చును.

(2) ఇది, 2022 జనవరి 1వ తేదీ నుండి అమలులోనికి వచ్చినట్లు భావించబడవలెను 31 JANUARY, 20221


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY


2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగాల (పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ) చట్టము,

1984 (ఇందు ఇక మీదట ప్రధాన చట్టమని పేర్కొనబడు)లోని 3వ పరిచ్ఛేదములో,

(1) ఉప-పరిచ్ఛేదము (1) లో "అరవై సంవత్సరములు" అను పదములకు బదులుగా 3వ పరిచ్ఛేదమునకు సవరణ. 1984 235 చట్టము

అరవై రెండు సంవత్సరములు" అను పదములను ఉంచవలెను. (2) ఉప-పరిచ్ఛేదము (2)లో "అరవై సంవత్సరములు" అను పదములకు బదులుగా

రెండు సంవత్సరములు" అను పదములను ఉంచవలెను. (3) ఉప పరిచ్ఛేదము (3) లో,

(ఎ) “అరవై సంవత్సరములు" అను పదములకు బదులుగా "అరవై రెండు

సంవత్సరములు" అను పదములను ఉంచవలెను. (బి) విశదీకరణ-IIలో "అరవై సంవత్సరములు" అను పదములకు బదులుగా

"అరవై రెండు సంవత్సరములు" అను పదములను ఉంచవలెను. (4) ఉపపరిచ్ఛేదము (4)లో,

(ఎ) ఖండము (ఎ)లో "అరవై సంవత్సరములు" అను పదములకు బదులుగా "అరవై రెండు సంవత్సరములు" అను పదములను ఉంచవలెను. (బి) ఖండము (బి)లో “అరవై సంవత్సరములు” అను పదములకు బదులుగా "అరవై రెండు సంవత్సరములు" అను పదములను ఉంచవలెను.

3. ప్రధాన చట్టవు 3వ పరిచ్ఛేదములోని ఉప-పరిచ్ఛేదము (2)లో, (1) "యాభై ఎనిమిది సంవత్సరములు" అను పదములకు బదులుగా “అరవై ఒక సంవత్సరములు" అను పదములను ఉంచవలెను.

(2) "అరవై సంవత్సరములు" అను పదములకు బదులుగా అవి ఎక్కడ వచ్చిననూ, రెండు సంవత్సరములు" అను పదములను ఉంచవలెను.


Get Download Ordinance Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.