Saturday 5 March 2022

KVS Admissions 2022 కోవిడ్ తో అనాధలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య

KVS Admissions 2022 కోవిడ్ తో అనాధలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య

KVS Admissions 2022 కోవిడ్ తో అనాధలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య ఏ క్లాస్ లోనైనా అడ్మిషన్ ఫ్రీ


KVS Admissions 2022 కోవిడ్ తో అనాధలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య


KVs to offer free admission for these children: కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన విద్యార్ధులకు పీఎమ్‌ కేర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ స్కీమ్‌ (PM Cares for Children Scheme) కింద ఏ తరగతిలోనైనా ఉచితంగా సీటు ఇవ్వనున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంగతన్‌ (free education in KVS) ప్రకటించింది.




దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 1200 కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 12వ తరగతి వరకు ఏ తరగతిలోనైనా ఫ్రీగానే విద్య నందించడానికి ముందుకొచ్చింది.

అంతేకాకుండా ఈ పథకం కింద ఇప్పటికే 4000 మంది విద్యార్థులకు చెందిన జాబితాను విద్యా మంత్రిత్వ శాఖ తయారు చేసి, ప్రాంతీయ అధికారులు, కేవీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పంపింది కూడా

కాగా కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ 1వ తరగతిలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభించింది.

ఇక 2 నుంచి 10వ తరగతికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్ 8న ప్రారంభం అవుతాయి.10వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలు ప్రకటించిన పది రోజుల్లో 11వ తరగతి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభంకానున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది.

కోవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలను వారి వయస్సు ప్రకారం ఆయా క్లాసుల్లో చేర్చుకుంటామని తెల్పింది

అందుకనుగుణంగా అన్ని రకాల ఫీజుల నుంచి మినహాయించి, ఉచితంగా ప్రవేశాలు కల్పించడమేకాకుండా, ఫ్రీగా విద్యను అందించనున్నట్లు తాజా నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేసింది. విద్యాలయ వికాస్ నిధి కేటగిరీ కింద, ఆయా జిల్లాల్లోని మెజిస్ట్రేట్‌ సిఫార్సుల మేరకు ఈ విధమైన విద్యార్ధులకు ప్రవేశం కల్పించనున్నట్లు తెల్పింది.

గరిష్టంగా 10 మంది విద్యార్థులు అంటే ఒక్కో తరగతికి ఇద్దరేసి చొప్పున, డీఎమ్‌లు ఎంపిక చేసి అడ్మిషన్‌ ఇవ్వొచ్చు.

ఈ టెహ్రాన్, మాస్కో, ఖాట్మండులోని అంతర్జాతీయ శాఖలతో సహా దేశంలోని మొత్తం 1200 పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది.

అడ్మిషన్లకు సంబంధించిన ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ kvsonlineadmission.kvs.gov.in ను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా సూచించింది


Visit official website Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.