Wednesday 16 March 2022

శ్రేష్ఠ పథకం (Shreshta) ద్వారా 9,11 తరగతులలో అత్యున్నత విద్యకు ఆహ్వానం

శ్రేష్ఠ పథకం (Shreshta) ద్వారా 9,11 తరగతులలో అత్యున్నత విద్యకు ఆహ్వానం

శ్రేష్ఠ పథకం (Shreshta) ద్వారా 9,11 తరగతులలో అత్యున్నత విద్యకు ఆహ్వానం సిబిఎస్ఇ అఫిలియేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నందు పూర్తి ఉచితముగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యని  అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు 9,11 తరగతులలో ప్రవేశాలు దరఖాస్తుకు ఏప్రిల్ 12 తుది గడువు


శ్రేష్ఠ పథకం (Shreshta) ద్వారా 9,11 తరగతులలో అత్యున్నత విద్యకు ఆహ్వానం


శ్రేష్ఠ (స్కీం ఫర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ క్లాస్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్ ) ద్వారా భారత ప్రభుత్వం ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు  సిబిఎస్ఇ అఫిలియేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నందు పూర్తి ఉచితముగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యని  అందిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలిపారు. 




ఈ పథకం ద్వారా దేశవ్యాప్తముగా ౩౦౦౦ మంది విద్యార్థులకు 9 వ తరగతి, 11 వ తరగతిలో ప్రవేశం కోసం అవకాశం కలిపించడం జరుగుతుందన్నారు.. షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల డ్రాప్ అవుట్ రేట్ ను నియంత్రించే ప్రయత్నం లో భాగముగా అర్హులైన విద్యార్థులకు ఈ అవకాశం ఉపకరిస్తుందని గంధం చంద్రుడు తెలిపారు. 


9 వ తరగతి లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు 11 వ తరగతి వరకు, 11 వ తరగతి లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు 12 వ తరగతి వరకు విద్యాబ్యాసం చేస్తారని, 12 వ తరగతి తరువాత పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనం పథకం,  టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా ఉన్నత విద్యని అభ్యసించేందుకు అవకాశం  లభిస్తుందన్నారు. https://jnanabhumi.ap.gov.in/ వెబ్ లింక్ ద్వారా పథకం మార్గదర్శకాలు లభ్యం అవుతాయని, https://shreshta.nta.nic.in/. వెబ్ లింక్ ద్వారా అర్హులైన విద్యార్థిని విద్యార్థులు ఏప్రిల్ 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు సూచించారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.