Sunday 13 June 2021

టీవీ సౌకర్యం లేని పిల్లలు 20% మొబైల్ 2జీ వినియోగదారులు 27%, ఆన్లైన్ తరగతులకు వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ

టీవీ సౌకర్యం లేని పిల్లలు 20% మొబైల్ 2జీ వినియోగదారులు 27%, ఆన్లైన్ తరగతులకు వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ

టీవీ సౌకర్యం లేని పిల్లలు 20% మొబైల్ 2జీ వినియోగదారులు 27%, ఆన్లైన్ తరగతులకు వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ| టీవీ సౌకర్యం లేని పిల్లలు 20%, ప్రత్యేకంగా ఫోన్, డేటా ఉన్నది 5 శాతం మందికే మొబైల్ ఉన్న వారిలోనూ 2జీ వినియోగదారులు 27%, ఆన్లైన్ తరగతులకు వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ


టీవీ సౌకర్యం లేని పిల్లలు 20% మొబైల్ 2జీ వినియోగదారులు 27%, ఆన్లైన్ తరగతులకు వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ



రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 20% మంది విద్యా ర్థులకు కనీసం టెలివిజన్ (టీవీ) సౌకర్యం లేదు. కంప్యూటర్ ఉన్నవారు ఒక్కరూ లేరు. పిల్లలకు ప్రత్యేకంగా మొబైల్ ఫోన్, అందులో డేటా ఉన్నవారు 5% మందే కరోనాతో విద్యా సంస్థలు మూతపడటంతో విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు అందించేందుకు విద్యాశాఖ సర్వే నిర్వహిస్తోంది. 




రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు సుమారు 38 లక్షల మంది వివరాలను సేకరించారు. విద్యార్థులకు ఉన్న సదుపాయం ఆధారంగా ఆన్లైన్ తరగతులను నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలోనూ ఫోన్ల సదుపాయం ఎక్కువగా లేనందున దూరదర్శన్ ద్వారా పాఠాలు ప్రసారం చేశారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్ అందుబాటులో లేనివారు 18% ఆ ఫోన్ ఉన్న 82శాతం మందిలో 2జీ కీబోర్డు ఫోన్లు ఉన్నవారు 27% ఫోన్తోపాటు మొబైల్ డేటా అందుబాటులో ఉన్న తల్లిదండ్రులు 20%


స్థానిక పరిస్థితుల ఆధారంగా


రాష్ట్రంలో ఆన్లైన్ పాఠాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాల వారీగా ఎవరికి వారు అందుబాటులో ఉన్న సదుపాయాలతో తరగతులు నిర్వహిస్తున్నారు. కొందరు వాట్సప్ గ్రూపులు, యూట్యూబ్, వీడియోల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రణాళిక రూపొందించగా. మరికొన్ని చోట్ల విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారు. 

కరోనాతో ఉపాధి కోల్పోవడం, కొందరికి ఆదాయం తగ్గిపోవడంతో మొబైల్ డేటా సమస్యగా మారుతోంది. ఫోన్ ఉన్నప్పటికీ ప్రతి నెలా డేటాకు రూ 150-250 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది పేదవారికి భారంగా మారుతోంది. ఫోన్లు తల్లిదండ్రుల వద్ద ఉంటుండటంతో విద్యార్థులు తరగతులకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడుతోంది. పనుల కోసం బయటకు వెళ్లే కుటుంబ పెద్దలు ఫోన్లు తీసుకుని వెళ్తుండటంతో వారు వచ్చే వరకు పిల్లలు ఎదురుచూడాల్సి వస్తోంది.


How to check Survey for Students having of Smart Phone, TV, Computer, Laptop Submission Dashboard Report click in below link

https://www.teacherfriend.in/2021/05/how-to-check-survey-for-students-having.html


AP Survey for Students having of Smart Phone, TV, Computer, Laptop, Tab Submission link Click in below

https://www.teacherfriend.in/2021/05/ap-survey-for-students-having-of-smart.html?m=1

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.