Thursday 17 June 2021

టెన్త్, ఇంటర్ పరీక్షలపై చర్చించలేదు: మంత్రి సురేష్

టెన్త్, ఇంటర్ పరీక్షలపై చర్చించలేదు: మంత్రి సురేష్

టెన్త్, ఇంటర్ పరీక్షలపై చర్చించలేదు: మంత్రి సురేష్|  పరీక్షల నిర్వహణకు సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం' అని మంత్రి సురేష్ సమీక్ష అనంతరం చెప్పారు


టెన్త్, ఇంటర్ పరీక్షలపై చర్చించలేదు: మంత్రి సురేష్


AP: విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించగా మంత్రులు ఆదిమూలపు వద్ద సురేష్, తానేటి వనిత ఈ సమీక్షలో పాల్గొన్నారు. 'టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ ఎలాంటి చర్చ జరగలేదు. 




సుప్రీంకోర్టు నోటీసుల విషయం మా దృష్టికి రాలేదు. నోటీసులు వస్తే మా నిర్ణయం మేము చెబుతాం. పరీక్షల నిర్వహణకు సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం' అని మంత్రి సురేష్ సమీక్ష అనంతరం చెప్పారు.


రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు


దేశంలో ఇంకా 12వ తరగతి పరీక్షలు రద్దు చేయని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 6 రాష్ట్రాల్లో పరీక్షలు జరగగా మిగతా రాష్ట్రాల్లో కొన్ని పరీక్షలు రద్దు చేశాయి. ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం పరీక్షలను ఇంకా రద్దు చేయలేదు. 

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు నోటీసులు పంపిన సుప్రీం.. సోమవారంలోగా తమ వాదనతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.