Friday 18 June 2021

వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నా - ముఖ్యమంత్రి జగన్‌

వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నా - ముఖ్యమంత్రి జగన్‌

వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నా - ముఖ్యమంత్రి జగన్‌ |  నేడే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల | ప్రభుత్వశాఖల్లో ఖాళీల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనున్నా - ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి:రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీ పోస్టులు, వాటి భర్తీకి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ రూపకల్పన కొలిక్కి వచ్చింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ ఆ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. 

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉన్న పోలీసు, విద్యా, వైద్య శాఖల్లో పోస్టుల వివరాలు, ఇతర ప్రభుత్వశాఖల్లో ఖాళీల వివరాలను పేర్కొనడంతో పాటు వాటిని ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారు? వాటి రాత, మౌఖిక పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే స్పష్టమైన వివరాలన్నీ క్యాలెండర్‌లో పేర్కొంటారు. 

అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అధికారులు సమాచారాన్ని సేకరించి క్రోడీకరించే పనిని కొలిక్కి తీసుకువచ్చారు. ఏపీపీఎస్సీ అధికారుల సహకారమూ తీసుకుంటున్నారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌, ఇతర అధికారులు దీనిపై వరుసగా సమావేశమవుతున్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.