Thursday 17 June 2021

నూతన విద్య విధానం పై పాఠశాల విద్యా శాఖ మంత్రి గారితో జరిగిన సమావేశానికి వివిధ ఉపాధ్యాయ సంఘాలు చేసిన ప్రాతినిధ్యలు

నూతన విద్య విధానం పై పాఠశాల విద్యా శాఖ మంత్రి గారితో జరిగిన సమావేశానికి వివిధ ఉపాధ్యాయ సంఘాలు చేసిన ప్రాతినిధ్యలు

నూతన విద్య విధానం పై పాఠశాల విద్యా శాఖ మంత్రి గారితో జరిగిన సమావేశానికి వివిధ ఉపాధ్యాయ సంఘాలు చేసిన ప్రాతినిధ్యలు| ఈరోజు సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ మంత్రి  సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశం లో పాఠశాల విద్యా శాఖామాత్యులు ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.


నూతన విద్య విధానం పై పాఠశాల విద్యా శాఖ మంత్రి గారితో జరిగిన సమావేశానికి వివిధ ఉపాధ్యాయ సంఘాలు చేసిన ప్రాతినిధ్యలు


 సమావేశంలో ప్రధానంగా నూతన విద్యా విధానం మీద ప్రభుత్వం తలపెట్టిన మార్పుల పైన చర్చ జరిగింది.  ఈ చర్చలో 49 ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి.




అన్ని సంఘాలు పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాల తో అనుసంధానం చేయటాన్ని స్వాగతించాయి.

అన్ని సంఘాలు ఉన్నత పాఠశాలలో +2ను తీసుకురావడాన్ని అంగీకరించాయి.

44 సంఘాలు 3, 4, 5 తరగతులు ప్రాథమిక పాఠశాల లోనే ఉండాలని చెప్పగా, రెండు సంఘాలు మాత్రం ఉన్నత పాఠశాలలో కలపడాన్ని సమర్థించాయి.

మిగిలిన సంఘాలు ఈ అంశంపై ప్రస్తావన చేయలేదు.

మాధ్యమం విషయమై దాదాపు 20 సంఘాలు  ప్రాథమిక విద్య మాతృభాషా మాధ్యమంలోనే కొనసాగాలని ఉన్నత పాఠశాలలలో సమాంతరంగా రెండు మాధ్యమాలు కొనసాగాలని చెప్పాయి. మిగిలిన సంఘాలు మాధ్యమం ప్రస్తావన చేయలేదు.

400 లేదా 500 విద్యార్థుల సంఖ్య ఉన్న ఉన్నత పాఠశాలలో  ప్లస్ టు ఏర్పాటు చేయాలని అత్యధిక సంఘాలు కోరాయి.

ప్రాథమిక పాఠశాలలలో ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లు మంజూరు చేయాలని, 9 , 10 ,11 ,12 తరగతులలో పిజిటి పోస్టులు మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలని, డీఎస్సీ ప్రకటించి, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సంఘాలు డిమాండ్ చేశాయి.

ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలన్నీ ఈ అంశాలపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు అందరూ అంగీకరించారని , అయితే  3, 4, 5 తరగతులను వేరు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారని ,దీనిపై ఆలోచన చేద్దామని అన్నారు .

ఇది ప్రారంభ సమావేశం అని ,తర్వాత తల్లిదండ్రులు, పాఠశాల కమిటీలు ,విద్యావేత్తలు, మేధావులు మరియు ఎమ్మెల్సీలు మొదలైన వారితో చర్చలు జరిపి  సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రస్తుతం  విద్యాశాఖ దీనికి సంబంధించిన సమాచారాన్ని, గణాంకాలు మాత్రమే సేకరిస్తున్న సేకరిస్తున్నదని అన్నారు.

ఈ సమావేశపు అభిప్రాయాలను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తానని చెప్పారు


వివిధ ఉపాద్యాయ సంఘాలు సమార్ఫించిన ప్రాతినిధ్యలు:


నేడు విద్యాశాఖ మంత్రి గారితో జరిగిన సమావేశంలో, నూతన విద్యావిధానం లోని లోపాలను సవరించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ప్రాతినిధ్యం చేసిన - PRTUAP




ఈ సమావేశంలో ఏపిటిఎఫ్ పక్షాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వరప్రసాద రావు  పాల్గొన్నారు

మిత్రులారా జాతీయ విద్యా విధానం 2020 పైన ప్రభుత్వ స్థాయిలో జరిగిన సమావేశం నకు ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు విద్యా శాఖ మాత్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బి రాజశేఖర్ IAS గారు డైరెక్టర్ వీరభద్రుడు IASగారు samagra డైరెక్టర్ శ్రీమతి vetriselvi IAS గారు ఇతర అ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

ఈ సమావేశంలో పాల్గొన్న దాదాపు నలభై ఐదు సంఘాలు మన అభిప్రాయాన్ని సమర్థించాయి. మనం ప్రీ ప్రైమరీ పాఠశాల ను ప్రైమరీ కి అనుసందించాలని, 3, 4, 5 తరగతుల తరలింపును ఆపాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకి PSHM పోస్టులు మంజూరు చేయాలని, 8వ తరగతి వరకు అన్ని యాజమాన్యాల లో మాతృభాషలో బోధన జరగాలని, ఉన్నత పాఠశాలలో సమాంతర మాధ్యమం కొనసాగాలని, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. 1:20 ఉండాలని ,ప్రస్తుతం ఖాళీగా ఉన్న 26 వేల పోస్టులు భర్తీ చేయాలని, సేవా సంస్థల ముసుగులో ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాన్ని నిరోధించాలని ప్రతి మండలంలో ఎక్కువ నమోదు కలిగిన రెండు ఉన్నత పాఠశాలలో ప్లస్ టు ప్రారంభించాలని, అందులో జూనియర్ లెక్చరర్ లు గా అర్హులైన ఉపద్యాయులను ప్రమోషన్ ద్వారా నియమించాలని, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరడం జరిగింది. 

ప్రభుత్వ సలహాదారు మన సూచనలను తన డైరీ నందు నమోదు చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పడం జరిగింది అలాగే డైరెక్టర్ గారు మాట్లాడుతూ సర్కులర్ 172 ద్వారా సమాచారాన్ని సేకరించేందుకు ఇచ్చామని అది ఉత్తర్వు కాదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఏదైనా నిర్ణయం జరిగినప్పుడు మాత్రమే మీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఉన్నచో పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలని అలా కాక ఎడాపెడా ప్రకటనలు ఇస్తే డిపార్ట్మెంట్ కొంత ఇబ్బంది పడుతుందని అందులో మీరు మేము భాగస్వాములని ఇకపైన మీకు మాకు మధ్య నమ్మకం తో ముందుకు సాగాలని కోరారు ప్రభుత్వ సలహాదారు ఫ్యాప్టో నాయకత్వానికి ఇచ్చిన మెమోలు ఉపసంహరించుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు.



0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.