Thursday 17 June 2021

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు ట్రావెల్ అలవెన్సులు, మెడికల్ రీఇంబర్స్‌మెంట్‌లపై కీలక నిర్ణయం తీసుకుంది


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు


కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ అమలు చేయనున్న సంగతి తెలిసిందే దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా జూలై 1 కోసం వెయిట్ చేస్తున్నారు అంతేకాదు డీఏ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగూ జూలై 1న వేతనాలు పెరగనున్నాయి వారికి కేంద్ర ప్రభుత్వం మరో రెండు శుభవార్తలు చెప్పింది.

అందులో ఒకటి ట్రావెల్ అలవెన్సుకు సంబంధించినది కాగా, మరొకటి మెడికల్ రీఇంబర్స్‌మెంట్‌కు సంబంధించినది.

రిటైర్మెంట్ సమయంలో ట్రావెల్ అలవెన్సులకు సంబంధించి క్లెయిమ్స్ సబ్మిట్ చేయడానికి ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును ఏకంగా 180 రోజులకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.

క్లెయిమ్ సబ్మిట్ చేయడంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అంటే రిటైర్మెంట్ తర్వాత సొంతూరికి వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందుకు సంబంధించిన ట్రావెల్ అలవెన్సుల క్లెయిమ్స్‌ను ఇకపై 180 రోజుల్లో సబ్మిట్ చేయొచ్చు. 2021 జూన్ 15న ఈ ఆర్డర్ అమల్లోకి వచ్చింది.

అయితే శిక్షణ, బదిలీ, టూర్లకు సంబంధించిన ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్స్‌ను సబ్మిట్ చేయడానికి 60 రోజుల గడువు ఉంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. కేవలం రిటైర్ట్ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లడానికి సంబంధించిన ట్రావెల్ అలవెన్సులు 180 రోజుల్లో సబ్మిట్ చేయొచ్చు.

ఇక మెడికల్ రీఇంబర్స్‌మెంట్‌కు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవోదయ విద్యాలయ పాఠశాలల్లో పనిచేసే ప్రిన్సిపాల్స్‌కు మెడికల్ క్లెయిమ్ రీఇంబర్స్‌మెంట్ సీలింగ్‌ను పెంచింది కేంద్ర ప్రభుత్వం.

ఇందుకు సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కీల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, కేంద్ర విద్యా శాఖ సర్క్యులర్ కూడా జారీ చేసింది. నవోదయ విద్యాలయ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు వార్షికంగా ప్రస్తుతం ఉన్న మెడికల్ రీఇంబర్స్‌మెంట్ రూ.5,000 సీలింగ్‌ను ఏకంగా రూ.25,000 చేసింది

ప్రభుత్వ ఆస్పత్రి లేదా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న నవోదయ విద్యాలయ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు ఇది వర్తిస్తుంది. దీంతో పాటు అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్ ట్రీట్‌మెంట్‌కు ప్రస్తుతం ఉన్న రూ.5,000 సీలింగ్‌ను రూ.15,000 చేసింది ప్రభుత్వం.

ఇక కేంద్ర ప్రభుత్వం గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన డీఏ, డీఆర్‌ను రీస్టోర్ చేయాలని నిర్ణయించింది. మొత్తం 11 శాతం డీఏ పెరగనుంది. ప్రస్తుతం ఉన్న డీఏ 17 శాతం+11 శాతం కలిపి మొత్తం 28 శాతం డీఏ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ పెరుగుతాయి.

ఇక 2020 జనవరి నుంచి జూన్ వరకు 3 శాతం, 2020 జూలై నుంచి డిసెంబర్ వరకు 4 శాతం, 2021 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం చొప్పున డీఏ, డీఆర్ బకాయిలు ఉన్నాయి. వీటిపైన జూన్ 26న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.