Saturday 26 June 2021

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు జూలై నెల రెండో వారం నుంచి అమలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు జూలై నెల రెండో వారం నుంచి అమలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు జూలై నెల రెండో వారం నుంచి అమలు పైలట్ ప్రాజెక్టుగా 500 గ్రామాలు ఎంపిక


గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు జూలై నెల రెండో వారం నుంచి అమలు


అమరావతి, ఆంధ్రప్రభ : ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించాలన్నా ఆధార్ తప్పనిసరైంది. అయితే కొన్ని సమయాల్లో ఆధార్ కార్డులో సవరణలు, మార్పులు, అనుసంధానాలతో పాటు అక్షర దోషాలను సరిచేసుకునేందుకు కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. 




అయినా కొన్నిసార్లు సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఉంది. అలాంటి కష్టాలకు పుల్స్టప్ పెట్టి, సేవలను సులభతరం చేసేందుకురాష్ట్రప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది, ఇప్పటివరకు పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో రోజుల తరబడి ఎదురుచేసే పనిలేకుండా గ్రామ, వార్డు సచివాలయల్లో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. 

ఇందుకు సంబంధించి జీవీడబ్ల్యూ అండ్ వీఎస్ డబ్ల్యూఎస్ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎన్. భరతుప్తా జీవోనెం. 156 విడుదల చేశారు. సచివాలయాల్లో ఆధార్ సేవలు జూలై రెండవ వారంలో సీఎం లాంఛనంగా ప్రారం భించనున్నారు. గతంలో మీసేవా కేంద్రాలలో ఆధార్ మా ర్పులు, చేర్పులు చేసేవారు. 

అయితే ప్రయివేటుగా నిర్వహిం చే కేంద్రాలలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో వాటికి రద్దు చేసి బాంకులు, పోస్టాఫీ సులకు పరిమితం చేశారు. అయితే బాంకుల్లో లావాదేవీలతో రద్దీగా ఉండి ఆధార్ సేవలు అందించడం కష్టతరమైంది. అదేవిధమైన పరిస్థితి పోస్టాఫీసుల్లో నెలకొంది. 

వైకాపా అధి కారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ అమలుకు ఆధార్ తప్పనిసరి దీంతో అమలుకు ఆధార్ తప్పనిసరి అయింది. దీంతో లబ్దిదార్రులు ఆధార్ కేంద్రాల వద్ద మార్పులు చేర్పులు చేయడానికి తీవ్ర జాప్యం జరుగు తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆధార్ సేవలను గ్రామ, వార్డు సచివాలయల్లో అందించాలని నిర్ణయం తీసుకుంది.

కొత్త ఆధార్ కార్డు జారీ, మార్పులు వంటి సేవలను గ్రామ, వార్డు సచివాల ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.అయితే మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా 500 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి, సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను జిల్లా సచివాలయల వ్యవస్థ జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. 

సచివాలయాల్లో అడ్మిన్ సెక్రటరీలు ఆధార్ సేవలను అందించనున్నారు. ప్రతి ఇంటిలో ఆధార్ సవరణలపై గ్రామ, వార్డు వలంటీర్లు దరఖాస్తులు అందిస్తారు. ఇందుకు సంబంధించి ధరలను ఈ విధంగా నిర్ణయించారు. 

కొత్తగా ఆధార్ కార్డు పొందేందుకు రూ.100, బయోమెట్రిక్ అప్డేడేట్ కోసం రూ.100, ఇతర సవరణల కోసం రూ.100, ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకునేందుకు రూ.30 ఫీజు వసూలు చేయనున్నారు. 

నూతనంగా ఆధార్ సేవలు గ్రామ, వార్డు సచివాలయ్యాల్లో లభిస్తే జనం కష్టాలు తీరనున్నాయి.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.