పాన్-ఆధార్ అనుసంధాన గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు | ఆదార్ అనుసంధాన గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసింది
పాన్-ఆధార్ అనుసంధాన గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదార్ అనుసంధాన గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఉద్యోగి కరోనా చికిత్స కోసం సంస్థ చేసే చెల్లింపులపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. అంతేకాదు చికిత్స కోసం వ్యక్తుల నుంచి తీసుకునే మొత్తం పైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగి కరోనాతో మరణించిన కేసుల్లో సంస్థ నుంచి వారి కుటుంబ సభ్యులకు చెల్లించే ఎక్స్రేషియాపైనా పూర్తి పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపింది.
అయితే, సంస్థ నుంచి కాకుండా ఇతరత్రా ఏ వ్యక్తి నుంచి అయినా నగదు సాయాన్ని స్వీకరిస్తే పన్ను మినహాయింపు రూ.10లక్షలకు పరిమితమవుతుంది. 'వివాద్ సే విశ్వాస్' పథకం గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగించింది.
ఫామ్-16 రూపంలో టీడీఎస్ సర్టిఫికెట్ను సర్టిఫికెటు ఉద్యోగులకు ఇచ్చే గడువును జూలై 31గా నిర్ణయించింది.
0 comments:
Post a Comment