Saturday 19 June 2021

బడి వేళకు సర్వం సిద్ధం ఏక రూప వస్రాలు రాత పుస్తకాలు సిద్ధం

బడి వేళకు సర్వం సిద్ధం ఏక రూప వస్రాలు రాత పుస్తకాలు సిద్ధం

బడి వేళకుసర్వం సిద్ధం ఏకరూప వస్త్రం, రాత పుస్తకాలు 3.90 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజన


బడి వేళకు సర్వం సిద్ధం ఏక రూప వస్రాలు రాత పుస్తకాలు సిద్ధం


ఈనాడు, అమరావతి బాలికలు, బాలుర వస్త్రాలు కరోనా తగ్గు ముఖం పట్టి పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలో భాగంగా రాతపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. జిల్లాల వారీగా ఇండెంట్లు స్వీకరించి వాటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.




అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాకు 7.09 లక్షల రాతపుస్తకాలు చేరాయి. అలాగే ఏకరూప దుస్తుల వస్త్రం కొంతమేర వచ్చింది. పాఠశాలలు పునఃప్రారంభిస్తే పిల్లలకు రాతపుస్తకాలు, ఏకరూప దుస్తుల పరంగా ఇబ్బంది లేకుండా ఉండాలని ముందస్తుగానే వాటిని సమీకరించి ఉన్నతాధికారులు పంపుతున్నారని సమగ్ర శిక్ష జిల్లా వర్గాలు తెలిపాయి. 3280 సర్కారీ పాఠశాలల్లో ఒకటో తరగతి ఉంచి పదో తరగతి వరకు 3.87 లక్షల మంది ఉన్నారు. మరో 3 వేల మంది పైగా కేజీబీవీ విద్యార్థినులు ఉన్నారు. చైల్డ్‌ ఇన్‌ఫో డేటాలో కొందరు విద్యార్థుల వివరాలు డ్రాప్‌బాక్సులో ఉండటంతో ఈ సంఖ్యలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, అయినా ప్రతి విద్యార్థికి వాటిని అందించటానికి అదనంగానే పుస్తకాలను పంపనున్నట్లు అధికారులు తెలిపారు. వీరందరికీ అవసరమైన రాతపుస్తకాలు, ఏకరూప దుస్తులు సమకూర్చుకునే పనిలో సంబంధిత యంత్రాంగం ఉంది. వీటిని ఉచితంగా ఇవ్వడం వల్ల సగటున ఒక్కో విద్యార్థికి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. 

చైల్డ్‌ ఇన్‌ఫోలో ఉన్న బాల బాలికల సమాచారం ఆధారంగా ఇప్పటికే రాతపుస్తకాలను ముద్రించి పంపే కార్యక్రమానికి యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ప్రతి విద్యార్థికి తరగతిని బట్టి రాత పుస్తకాలు ఎన్ని అవసరమో గుర్తించి ఆ మేరకు పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాత పుస్తకాలే కాదు, పాఠ్యపుస్తకాలను ఇవ్వనున్నారు. జిల్లాకు 16 లక్షల మేరకు పాఠ్యపుస్తకాలు చేరగా వాటిని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలోని పాఠ్యపుస్తకాల యంత్రాంగం స్వాధీనం చేసుకుని పాఠశాలలకు పంపుతోంది.

ఆర్టీసీకి చెందిన కార్గో బస్సుల ద్వారా ఇప్పటికే 5 లక్షల పుస్తకాలను మండల కేంద్రాలకు చేర్చారు. నెలాఖరుకల్లా ఏకరూప దుస్తులు, రాతపుస్తకాలను మండలాలకు పంపాలని యోచిస్తున్నారు. జేవీకే కిట్లలో భాగంగా బెల్టులు, షూస్‌, సాక్సులు కొంతమేరకు వచ్చాయి.

21.30 లక్షల అవసరం అవుతాయని ఇండెంట్‌ పంపారు. వాటిల్లో 7.09 లక్షల పుస్తకాలు ఇప్పటికే జిల్లాలోని సమగ్ర శిక్ష గోదాముకు చేరాయి. పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తుల వస్త్రం నాణ్యతను అధికారులు పరిశీలించారు. ఇవన్నీ నాణ్యంగా ఉన్నాయని ఎలాంటి లోపాలు లేవని ఉన్నతాధికారులకు తెలియజేశారు. 

ప్రస్తుతం రవాణాలో 5.22 లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఇంకా 8.98 లక్షలు రావాల్సి ఉంది. పిల్లలకు వర్క్‌బుక్‌లు, 5వ తరగతి పైబడిన వారికి సింగిల్‌రూల్‌, బ్రాడ్‌రూల్‌, తదితరాలు అందజేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏకరూప దుస్తులు సకాలంలో విద్యార్థి దరి చేర్చేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. గతంలో స్టిచ్చింగ్‌ చేసి ఇచ్చేవారు. అవి కొందరు విద్యార్థులకు చాలీచాలక అసౌకర్యంగా ఉండటంతో ఈసారి పూర్తిగా వస్త్రమే విద్యార్థులకు అందించనున్నారు. 

ప్రతి విద్యార్థికి అవసరమైన వస్త్రాన్ని ఓ కవర్‌లో పెట్టి స్కూల్‌ కాంప్లెక్సుకు పంపుతున్నారు. వాటిని బడి తెరిచిన రోజే విద్యార్థులకు అందజేస్తారు. గతేడాది బాలికలకు ఇచ్చిన వస్త్రం నాణ్యతలో లోపాలు ఉండటంతో ఈసారి కొంచెం డిజైన్‌మార్చి నాణ్యమైన వస్త్రాన్ని పంపారని అధికారులు చెప్పారు.


తల్లి ఖాతాలోకి కుట్టు ఖర్చులు జమ


జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులతో పాటు కేజీబీవీ విద్యార్థినులకు అవసరమైన రాతపుస్తకాలు, ఏకరూప దుస్తులను ప్రభుత్వం కొనుగోలు చేసి పంపుతోంది. ఇప్పటికే ఏడు లక్షలకు పైగా రాతపుస్తకాలు స్వాధీనం చేసుకున్నాం. ఏకరూప దుస్తులు కవర్లలో పెట్టి పంపుతున్నారు. ప్రతి విద్యార్థికి మూడు జతలు క్లాత్‌ ఇస్తాం. 1-8 తరగతుల విద్యార్థులకు కుట్టు ఖర్చులు జతకు రూ.60 చొప్పున రూ.180, 9, 10 విద్యార్థులతో పాటు కేజీబీవీ విద్యార్థినులకు కూడా మూడేసి జతలు క్లాత్‌ అందిస్తాం. వీరికి ఒక్కో జతకు కుట్టు ఖర్జులు రూ.80 చొప్పున రూ.240 వారి తల్లుల ఖాతాకు జమ చేస్తాం.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.