Saturday 19 June 2021

ఏడో తరగతి పుస్తకాలు మార్పు పాఠ్య పుస్తకాలు సిద్ధం మండల కేంద్రాలకు పంపిణీ

ఏడో తరగతి పుస్తకాలు మార్పు పాఠ్య పుస్తకాలు సిద్ధం మండల కేంద్రాలకు పంపిణీ ఏడో తరగతి పుస్తకాలు మార్పు మిగిలిన తరగతులన్నింటికీ సరఫరా


ఏడో తరగతి పుస్తకాలు మార్పు పాఠ్య పుస్తకాలు సిద్ధం మండల కేంద్రాలకు పంపిణీ


ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించేందుకు కసరత్తు జరుగుతోంది. జిల్లాకు అవసరమైన ప ుస్తకాలను విద్యా శాఖ సిద్ధం చేసింది. తాడేపల్లి గూడెం జిల్లా పాఠ్య పుస్తకాల పంపిణీ కేంద్రంలో గోదాము సామర్థ్యాన్ని బట్టి పుస్తకాలను రప్పిస్తున్నారు. 




మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఏడో తరగతి పాఠ్య పుస్తకాలు మారడంతో వాటిని ముద్రించాల్సి ఉంది. ఆ తర్వాత మాత్రమే జిల్లాకు కేటాయించనున్నారు. ఆ ఒక్క తరగతి తప్ప మిగిలిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయడంతో గత ఏడాది పాఠ్య పుస్తకాల పంపిణీ లో తీవ్ర జాప్యం జరిగింది.

కొవిడ్‌ మొదటి వేవ్‌ తో పాఠశాలలు ఆలస్యంగా తెరిచారు. అయినా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయలేకపోయా రు. ఈ ఏడాది విద్యా శాఖ పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయడంలో విజయవంతమైంది. జిల్లాలో అవసరమైన పుస్తకాలను ఇండెంట్‌ను ముందుగానే పంపించారు. కరోనా లేనట్టయితే ఈ సరికే పాఠ శాలలు తెరచుకునేవి. తరగతు లు ప్రారంభమయ్యేవి. విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉండేవి. అయినా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు విద్యా శాఖ సమాయత్త మవుతోంది.

విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజే యాలని సంకల్పించింది. మండల కేంద్రా లకు చేరుకున్న పుస్తకాలను సంబంధిత పాఠశాలలకు అందజేయను న్నారు. అనంతరం విద్యార్థులకు అందించనున్నారు. 


మండల కేంద్రాలకు పుస్తకాలు


జిల్లాకు 2021–22 విద్యా సంవత్సరంలో 36,61,265 పుస్తకాలు అవసరమని అంచనా వేశారు. గత ఏడాదే జిల్లా పాఠ్య పుస్తకాల పంపిణీ కేంద్రంలో 6,46,021 పుస్తకాలు నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది  ప్రభుత్వం నుంచి 14,50,444 పుస్తకాలు చేరుకున్నాయి. మొత్తం 20,96,465 పుస్తకాలు తక్షణం అందుబాటులో ఉన్నాయి. వీటిలో 9,76,932 పుస్తకాలను మండల కేంద్రాలకు పంపించారు. మిగిలిన పాఠ్య పుస్తకాలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ గోదాములు ఖాళీ అయితే మళ్లీ ప్రభుత్వం నుంచి పుస్తకాలను రప్పించనున్నారు.

ఏడో తరగతి మినహా మిగిలిన తరగతులకు సంబంధించి పుస్తకాలు ముద్రించి ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం నుంచి 15.50 లక్షల పుస్తకాలు వస్తే విద్యార్థులకు సరిపోనున్నాయని అంచనా వేశారు. ఏడో తరగతికి సంబంధించి 3.40 లక్షల పుస్తకాలు అవసరం కానున్నాయి. అవి ముద్రించాల్సి ఉంది. మిగిలిన 12.10 లక్షలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో పంపిణీని బట్టి కేటాయిస్తున్నారు.

రానున్న పదిహేను రోజుల్లో మొత్తం పుస్తకాలను రప్పించి మండల కేంద్రాలకు పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.